తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2 న కవి సమ్మేళనం ఏర్పాటు – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2 న కవి సమ్మేళనం ఏర్పాటు – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2 న కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. అందులో భాగంగా జూన్ 2 న సాయంత్రం 4. 00 గంటల నుండి 6 గంటల వరకు కలెక్టరేట్లోని ఆడిటోరియం లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, తెలంగాణ ప్రాశస్త్యం, తెలంగాణ కళలు, తెలంగాణ ప్రజల జీవన విధానం, తెలంగాణను ప్రతిబింబించే అంశాలపై కవి సమ్మేళనం ఉంటుందని ఆయన తెలిపారు. ఇట్టి కవిసమ్మేళనంలో పాల్గొనదలచిన ఆసక్తి గల కవులు, సాహితీవేత్తలు, అన్ని రంగాలలోని ఔత్సాహికులు ఈ నెల 28 న సాయంత్రం 5 గంటలలోగా కవి సమ్మేళనం సమన్వయాధికారి అయిన జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి 8328599157 వాట్సాప్ నెంబరుకు తమ పేరు, చిరునామా, వృత్తి, మొబైల్ నెంబర్ వివరాలు పంపి పేరు నమోదు చేసుకోవలసినదిగా కలెక్టర్ సూచించారు.

Share This Post