తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్- ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన
తేది 29-5-2023
నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్లు. ఉదయ్ కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సన్నద్ధత పై సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ కే. మనోహర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పట్లు చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 9.00 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికలకు మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలంకరణ తో అందంగా అలంకరించి జూన్ 3వ తేదీన తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. 21 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు రోజుకో శాఖ చొప్పున ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 3వ తేదీన రైతు దినోత్సవం, 8వ తేదీన ఊరూరా చెరువుల పండగలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ విజయవంతం చేయడానికి మండలస్థాయి నోడల్ అధికారులు, కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. హోర్డింగ్ లు, ఫ్లెక్సీ లు కరపత్రాలు, పోస్టర్లు ద్వారా విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సురక్ష దినోత్సవం, తెలంగాణ విద్యుత్ విజయోత్సవం కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, సాగునీటి విజయం, చెరువుల పూర్వ వైభవం సాధించిన అభివృద్ధి తదితర అంశాల వారీగా జరిగే రోజుకో ఉత్సవాలను పురస్కరించుకుని అధికారులకు తగు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి లో కవి సమ్మేళనం నిర్వహించి కవులు, కళాకారులను సన్మానించడం జరుగుతుందన్నారు. జూన్ 12 వ తేదీన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉదయాన్నే తెలంగాణ రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 13వ తేదీన మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మహిళలు మహిళా అధికారులతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తమ మహిళా ఉద్యోగులను సన్మానం చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం రోజున అన్ని గ్రామ పంచాయతీల్లో ఉదయాన్నే ర్యాలీలు నిర్వచించి జెండాలు ఎగురవేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ నాడు ఎలా ఉండే నేడు ఎలా అభివృద్ధి సాధించింది అనే అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మరుసటి రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో సఫాయన్న – సలామన్న అనే బ్యానర్ లతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తమ ప్రజా ప్రనిధులను ఆరోజు సన్మనించుకోడం జరుగుతుందన్నారు. జూన్ 2వ తేది నుండి జూన్ 22 వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి అమరుల సంస్మరణ దినోత్సవం వరకు ప్రజలు, ప్రజాప్రతినిధులను, అధికారులు, మీడియా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడం జరుగుతుందని తెలియజేశారు.
జిల్లా ఎస్పీ కే. మనోహర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడిస్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవెన్యూ మోతీలాల్, అడిషనల్ ఎస్పీ సి.హెచ్. రామేశ్వర్, మరో అడిషనల్ ఎస్పీ భరత్, జిల్లా అధికారులు, తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post