తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

 

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 

0 0 0 0 0

            తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు.

 

            గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే జూన్ 2 వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు తో కలిసి పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 08:30 ని.లకు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దం నివాలులర్పించి 9 గంటలకు  పరెడ్ గ్రౌండ్ లో రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పతాకావిష్కరత గావిస్తారని, అనంతరం నిర్వహించే కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఏర్పాట్లను మరోసారి సమీక్షించుకొవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్, ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ పరిశీలించి  అధికారులకు పలు సూచనలను అందించారు.

 

             అనంతరం కేబుల్ బ్రిడ్జి నిర్మాణ  పనులను పరిశీలించిన కలెక్టర్ పనులలో వేగం పేంచాలని, జూన్ 17 ప్రారభించేలా  నిర్మాణ  పనులను రాత్రింబవళ్లు  నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

 

             ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్,ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్ ఇతర పోలీస్, రెవిన్యూ అధికారులు పాల్గోన్నారు.

Share This Post