తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిది…..రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్*

తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిది…..రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్*

ప్రచురణార్థం

*తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిది…..రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్*

మహబూబాబాద్, జూన్ -2:

తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

గురువారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా *తెలంగాణ స్ఫూర్తి* అంశంపై ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంను ముఖ్య అతిథిగా విచ్చేసి
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దాశరథి కృష్ణమాచార్యులు, బమ్మెర పోతన, కాళోజీ నారాయణ రావు చిత్ర పటాలకు పూలమాలలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహబూబాబాద్ లో కవులు ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అనుకోలేదని, కవి సమ్మేళనంలో మహిళలు, చిన్నారులు, అంగన్ వాడి టీచర్ లు ఉండడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది అని, ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవ లేనిది అని, వారు చూపిన ఉద్యమ స్ఫూర్తి నీ గుర్తించి ముఖ్యమంత్రి కళాకారులకు సాంస్కృతిక సారథి కళాకారులుగా గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారదులుగా ఉపయోగిస్తున్నారు అని తెలిపారు. కవులను, కళాకారులను ముఖ్యమంత్రి గౌరవించు కునే తీరును చూస్తే సంతోషంగా ఉందని తెలిపారు.

చిన్నారి వైదృతి మానుకోట రాల్లకున్న శక్తిని బ్రహ్మాండంగా చెప్పగలిగారు అని, జిల్లాలో ఉన్న మరింత మంది కవులను వెలికి తీసే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ అన్గోతు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే పాడిన పాటలు కార్యక్రమానికి విచ్చేసిన వారందరిని అలరించింది.

కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న 22 మంది కవులు, కవయిత్రులకు మంత్రి, జెడ్పీ చైర్ పర్సన్, మునిసిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఎస్పి ప్రసంసా పత్రాలను, మేమొంటో లను అందించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు , మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post