తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి గొప్ప కృషి చేసిన వ్యక్తి ప్రొః జయశంకర్‌ సార్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం

తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రాఫెనర్‌ జయశంకర్‌ నదాన్మరణీయుడని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన ఆవరణలో ప్రొ॥ కొత్తపల్లి జయశంకర్‌ 87వ జయంతి నందర్భంగా చిత్రపటానికి పూలమాల వేని ఘనంగా నివాళులు అర్చించారు. ఈ నందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రొః జయశంకర్‌ ఆశించిన తెలంగాణ రాష్ట్రం నిద్ధించిందని, అన్ని రంగాల్లో నమ(గ్రాభివృద్ధి సాధించడమే ఆశయంగా ముందుకు సాగారని, తెలంగాణ యావత్‌ ప్రజానీకం మననులో జయశంకర్‌ సార్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నురేశ్‌, డి.ఎన్‌.ఓ. స్వామి కుమార్‌, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కుమంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

 

Share This Post