*తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయశంకర్ సర్ జయంతి*

* ప్రచురణార్థం *

ములుగు జిల్లా:

ఆగస్టు 6 (శుక్రవారం).

*తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయశంకర్ సర్ జయంతి*

తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా పేరు గాంచిన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ సర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్వో రమాదేవి గారు ఆచార్య జయశంకర్ సర్ ఫోటో కి పూలమాల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ సర్ ‌చేసిన నిరంతర కృషిని, తెలంగాణ ప్రజలు  ఎప్పటికీ మర్చిపోలేని విధంగా వారి జయంతి ప్రభుత్వ లంచనాలతో నిర్వహించి వారికి తగిన గుర్తింపు కల్పించారని,వారిని  తెలంగాణకు దిక్సూచి గా చెప్పుకొనవచ్చునని  వారు అన్నారు. జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖ కార్యాలయాలలోను వారి యొక్క జయంతిని నిర్వహించారు.

———————————————————————————————————————————–

ఈ కార్యక్రమంలో  జిల్లా  అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post