తెలంగాణ కోసం పోరాడిన గొప్ప మహనీయురాలు ఐలమ్మ,జిల్లా కలెక్టరేట్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, అధికారులు, నాయకులు

తెలంగాణ కోసం పోరాడిన గొప్ప మహనీయురాలు ఐలమ్మ
జిల్లా కలెక్టరేట్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, అధికారులు, నాయకులు
తెలంగాణ కోసం పోరాడిన మహనీయురాలు, వీరనారీమణి చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తిదాయకమని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాటంలో తన పౌరుషాన్ని, పోరాటాన్ని చాటారని ఉద్యమ స్ఫూర్తిని అందరికీ తెలియజేసిన పోరాట యోధురాలు అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి మహిళా యోధురాలు అయిన మహిచాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఇది ఎంతో శుభపరిణామమని కలెక్టర్ అన్నారు. ప్రతి సంవత్సరం ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఝాన్సీ, బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post