తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను 3రోజుల్లోగా గుర్తించాలి

తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను 3రోజుల్లోగా గుర్తించాలి

స్థలాలను గుర్తించిన నివేదిక ప్రతిరోజు ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000


తెలంగాణ క్రీడా ప్రాంగణాల కు 100 శాతం స్థలాలన 3 రోజుల్లోగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ,పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు మరియు మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మండలాల వారీగా సమీక్షించారు. తెలంగాణ గ్రామీణ క్రీడ ప్రాంగణాలకు అనువైన స్థలాలను మూడు రోజుల్లోగా గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు స్థలాలకు తహసీల్దార్,ఎంపీడీవో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల కోసం గుర్తించిన స్థలాలలో సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అనువైన స్థలాలు లేనిచోట పాఠశాలలకు కేటాయించిన స్థలాన్ని మినహాయించి, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉన్న మైదానాలను క్రీడా ప్రాంగణాలు గా తీర్చిదిద్దాలన్నారు. పోరంబోకు, బంజరు, ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను, శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పురాతన భవనాలను తొలగించి క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్ డి ఓ లు ప్రతిరోజు సమీక్షించి జిల్లా లక్ష్యం 402 క్రీడా ప్రాంగణాలు గుర్తించాలన్నారు క్రీడా ప్రాంగణాలుగా గుర్తించిన స్థలాల్లో హద్దులు నిర్ణయించి ఎంపీడీఓలకు అప్పజెప్పాలని తహసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే శుక్రవారం లోగా క్రీడ ప్రాంగణాలను గ్రౌండింగ్ చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, ల్యాండ్ సర్వే కాస్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్, తహసిల్దార్లు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post