భువనగిరి మునిసిపాలిటి వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య గారు మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న బాల బాలికలకు మానసిక ఉల్లాసం కలగడం కోసం వారికీ విహారయాత్రలో భాగంగా యదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లో గల ఆభరణ్యంను చూపించడం జరిగినది. బాల బాలికలకు ఆటలతో పాటు మానసికంగా దృడంగా ఎదగడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది అని అన్నారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మందడి ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ బాల బాలికకు చిన్న వయస్సు నుండే ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని రాబోయే రోజులలో మంచి క్రీడాకారుల ఎదగాలని వారు అన్నారు.
జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె.ధనంజనేయులు గారు మాట్లాడుతూ రాయగిరి లో శిక్షణ పొందుతున్న సుమారు (200) మంది బాల బాలికలు ఈ యాత్రలో పాల్గొన్నారు వీరికి యాత్ర యోక్క ఉపయోగాన్ని వివరించి అరణ్యంలో వున్నా జంతువులు లను అటవీశాఖ సిబ్బంది తో బాల బాలికలకు విరించడం జరిగినది అని అన్నారు.
ఈ కార్యక్రములో జిల్లా మునిసిపాలిటి వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య గారు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖా ప్రాజెక్ట్ డైరెక్టర్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె.ధనంజనేయులు, జిల్లా excise superintend నవీన్ గారు, శాంతి ట్రాక్ సభ్యులు అనిల్, శ్రీనివాస్, గిరి, రమేష్, శంకర్, కుమార్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ మరియు సిబ్బంది హుస్సేన్ పాల్గొన్నారు.