తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట
శనివారం రోజున తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బందితో కలిసి అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్సవ కోట జెండా ఆవిష్కరించారు అనంతరం జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాలాపన చేశారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో 1948న సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన ఒక విశిష్టత ఉందని 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని అందుకే జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ను నిర్వహించుకుంటున్నాం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ స్ హరి సింగ్ సంబంధిత కలెక్టర్ కార్యాలయ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post