తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పకడ్భందీ ఏర్పాట్లు, వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,

పత్రిక ప్రకటన

తేదీ : 14–09–2022

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పకడ్భందీ ఏర్పాట్లు,
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు పకడ్భందీగా, ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.
@@@@@@@@@
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లు. మేడ్చల్ – మల్కాజిగిరిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యేలా ముందస్తు ప్రణాళిక రూపొందించామని అందుకు అనుగుణంగా ముందుకెళ్తామని వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. అనంతరం కలెక్టర్ హరీశ్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 16న జిల్లాలో 5, నియోజకవర్గాల వారిగా హెడ్ క్వార్టర్ లలో 15 వేల మందితో భారీ ర్యాలీనిర్వహించుటకు ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ, జిల్లా అధికారులు, ప్రజలు అందరు ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా రూట్ మ్యాప్ తయారు చేసుకొని ర్యాలీ ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ, ర్యాలి అనంతరం కౌంటర్ల వారిగా మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు, వచ్చే బస్సుల పార్కింగ్ ఏర్పాట్లు, టై యిలెట్స్ మొదలైన సౌకర్యాలు అన్ని ఉండేవిదంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దీనికోసం ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే 17న జిల్లా కేంద్రమైన మేడ్చల్లో ముఖ్య అతిధితో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని దీనిని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం హైదరాబాద్లో ఆదివాసీ భవన్ బంజారా భవన్ ప్రారంభానికి జిల్లా నుంచి వాహనాలను సమకూర్చి వారిని అక్కడకు తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. వారికి అవసరమైన త్రాగునీరు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, సకాలంలో హైదరాబాద్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపినారు. సమైక్యతా వజ్రోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులను, స్వాతంత్ర సమరయోధుల సన్మానం చేయాలని పేర్కొన్నారు. అలాగే మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్ డి ఓ లు రవి, మల్లయ్య , జడ్పీ సీఈవో దేవసహాయం ,కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి పద్మజారాణి,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వినోద్, డీఈవో విజయకుమారి, జిల్లా పంచాయతీ అధికారి. రమణ మూర్తి ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస్, డి ఐ ఈ ఓ ,కిషన్ ,డి వై ఎస్ ఓ ,బలరాం ,జిల్లాలోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post