తెలంగాణ డెవలప్మెంట్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బెడ్ వింగ్స్, ఆక్సిజన్ ఫ్లో లైన్స్ ఏర్పాటు హర్షణీయం జిల్లా కలెక్టర్ డి హరిచందన

తెలంగాణ డెవలప్మెంట్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో   ఆక్సిజన్ బెడ్ వింగ్స్, ఆక్సిజన్ ఫ్లో లైన్స్ ఏర్పాటు హర్షణీయం జిల్లా కలెక్టర్ డి హరిచందన

మద్దూరు మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పదిలక్షలవిలువైన   ఆక్సిజన్ బెడ్ వింగ్స్, ఆక్సిజన్ ఫ్లో లైన్స్ ను జిల్లా కలెక్టర్ డి హరిచందన రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు.  తెలంగాణ డౌలప్మెంట్ ఫోరమ్ TDF(usa) సంస్థ 1999సం లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పడిన ఎన్ అర్ ఐ లతో స్థాపించబడింది , తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరము రాష్ట్ర అభివృద్ధి కొరకు పటుబడే సంస్థ, కోవిద్- 19  2020సం లో వ్యాపిస్తున్న సమయములో tdf (usa) వారు రిలీఫ్ ప్రాజెక్ట్ లో బాగంగా  కలెక్టర్ గారి సూచన మేరకు విరాళంగా మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు10 లక్షల విలువ గల ఆక్సిజన్ బెడ్స్ తో పాటు వైద్య సిబ్బందికి  మస్కులు, సనిటైజర్స్, ఫేస్ శేల్డ్, ఇన్ఫ్రారెడ్ ధర్మామీటర్లు,ppi కిట్సు , పల్స్ అక్సి మీటర్లు మొదలుగునవి ఉదారంగా పంపిణీ చేయటం జరిగింది , tdf సంస్థ వారు ఉదారంగా ఎర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్  అభినందనలు ,కృతజ్ఞతలు తెలిపారు, ఇక ముందు కూడా నారాయణ పేట జిల్లా అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వవలసిన దిగా కోరారు. ఆసుపత్రి ప్రాంగణం లో ఏర్పాటు ను ప్రతినిధు లతో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమానికి TDF (usa) అధ్యక్షులు కవితా చెళ్ళ,ఉపాధ్యక్షులు ప్రీతి రెడ్డి,tdf ఇండియా రీజినల్ కో ఆర్డినేటర్ శివంత్ రెడ్డి, మురళి చింతపని, మట్ట రాజేశ్వర రెడ్డి, అనుపమ రెడ్డి, కృష్ణా రెడ్డి, డాక్టర్ శైలజ dlo, డాక్టర్ రాఘవేందర్ మండల స్పెషల్ అఫీస్ ర్ కృష్ణమాచారి  సర్పంచి అరుణ ఎంపి పి విజయలక్ష్మి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి,ఎంపి టి సి వెంకటయ్య, డి టి,mpo తదితరులు పాల్గొన్నారు.

Share This Post