తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను జిల్లాలో భావితరాలు గుర్తుంచుకొనేలా నిర్వహించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,


రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలకు జిల్లా ప్రత్యేక అధికారిణిగా బోయి విజయేందిర,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అధికారులతో ఆలయం, చెరువులు పరిశీలించిన ప్రత్యేకాధికారిణి బోయి విజయేందిర,
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు భావితరాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా బుధవారం జిల్లా ప్రత్యేక అధికారిణి బోయి విజయేందిర తో కలిసి కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా స్థాయి అధికారులు శామీర్పేటలోని కట్టమైసమ్మ ఆలయాన్ని దర్శించుకొన్నారు. అనంతరం శామీర్పేట చెరువు, చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి అర్చకులు జిల్లా ప్రత్యేక అధికారిణి విజయేందిర బోయి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కీసరలోని రైతువేదికను పరిశీలించి చేపట్టాల్సిన మరిన్ని పనులకు సంబంధించి సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో రైతు దినోత్సవాన్ని , సాగునీటి దినోత్సవాన్ని , ఊరూరా చెరువుల పండగతో పాటు ఇప్పటి వరకు ఏఏ పనులు చేశారన్న వివరాలను అడిగి తెలుసుకొని మరికొన్ని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ప్రత్యేక అధికారిణి బోయి విజయేందిర కు వివరిస్తూ . రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా, పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులతో పలుమార్లు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించామని వారికి పూర్తి స్థాయిలో దిశా నిర్ధేశం చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఆదివారం సైతం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో కార్యాచరణ ఆమోదించుకోవడంతో పాటు గ్రామ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కార్యక్రమాలపై అవగాహన తీసుకువచ్చి సిబ్బంది విధులు కేటాయిస్తూ ఆదేశాలు సైతం జారీ చేసినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా ప్రత్యేక అధికారిణి బోయి విజయేందిర కు స్పష్టం చేశారు. అలాగే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా క్లస్టర్ పరిధిలో, గ్రామాల్లో చేపట్టబోయే పెద్ద కార్యక్రమాలైన రైతు దినోత్సవం, ఊరూరూ చెరువుల పండగలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులను సమాయత్తం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. దీంతో పాటు నోడల్ అధికారులు తమ శాఖ ఇచ్చే ఆదేశాలతో పాటు కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం 2014కు ముందు ప్రస్తుతం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై నియోజకవర్గం వారీగా గ్రామ, మండలాల వారీగా నాడు – నేడు పరిస్థితులను అద్దం పట్టే విధంగా అవసరమైన చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆదేశాలను జారీ చేసినట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల రోజుల్లో ఆయా శాఖ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కరపత్రాలను సైతం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని లబ్ధిదారుల విజయగాథలు, అభిప్రాయాలను నలుగురికి తెలిసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్ని మున్సిపాలిటీల్లో, జిల్లా ప్రవేశం, ముగింపు ప్రాంతాల్లో, జంక్షన్లలో ఆర్చీలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరణలు చేస్తున్నామని అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుద్దీపాలను అలంకరించాలని సూచించామని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాలో ఆయా కార్యక్రమాల నిర్వహణపై డాక్యుమెంటేషన్తో పాటు వీడియో చిత్రీకరణ చేయడం జరుగుతుందని జిల్లా ప్రత్యేక అధికారిణి విజయేందిర బోయికి కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా ప్రత్యేక అధికారిణికి వివరించారు.
ఈ సంరద్భంగా శనివారం తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయరంగంలో ప్రస్తుతం సాధించిన ప్రగతిని, విజయాలను, ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలియచేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు.
జూన్ 7వ తేదీన బుధవారం “సాగునీటి దినోత్సవంలో భాగంగా సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేయాలని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జూన్ 8వ తేదీన గురువారం “ఊరూరూ చెరువుల పండగ”నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు, గోరేటి వెంకన్న రచించిన చెరువు పాటలు సహా చెరువు మీద ఇతర కవులు రచించిన పాటలను పాడుతూ మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహించాలని చెరువు కట్టలపై సభలు నిర్వహించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాటు చేయాలని అందుకు ఇప్పటి నుంచి అధికారులు ముందస్తు సన్నాహాలు చేస్తున్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా ప్రత్యేక అధికారిణి విజయేందిర బోయికి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, ఆర్డీవో రవి, ఇరిగేషన్ డీఈ సురేష్, జిల్లా వ్యవసాయాధికారిణి రేఖా మేరీ, ఉద్యాన శాఖ అధికారి నీరజ గాంధీ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post