తెలంగాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ పండుగను నేడు దేశ విదేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానంలో గల బతుకమ్మ ఘాట్ ను వివిధ శాఖల అధికారులతో సందర్శించి అక్టోబర్ 3 వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు.

తెలంగాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ పండుగను నేడు దేశ విదేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానంలో గల బతుకమ్మ ఘాట్ ను వివిధ శాఖల అధికారులతో సందర్శించి అక్టోబర్ 3 వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా మహిళలు జరుపుకొనే  పండుగ బతుకమ్మ అని అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల సందర్భంగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాట్ లో, బతుకమ్మ ఆడే ప్రాంతంలో లైట్ లను ఏర్పాటు చేయాలని, బతుకమ్మ పాటలతో సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. అదేరోజు మహిళలు ఇబ్బందులు పడకుండా ఈరోడ్డులో ట్రాఫిక్ ను మళ్లించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అక్కడికి వచ్చే వారికి వాటర్, అల్పాహారం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు బతుకమ్మ ఆడాలంటే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్తితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి మహిళలు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం 340 కోట్ల రూపాయల వ్యయంతో కోటి 18 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, RDO వసంత,HMDA అధికారి BLN రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి,  ACP లు లింగేశ్వర్, భాస్కర్, R&B SE హఫీజుద్దీన్, EE రవీంద్ర మోహన్ తదితరులు ఉన్నారు.

Share This Post