తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరుగని పోరాట యోధుడు, ఉద్యమ జీవి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరుగని పోరాట యోధుడు, ఉద్యమ జీవి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా సోమవారం సంగారెడ్డిలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఫల పరిశోధన కేంద్రం) లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహానికి జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతోత్సవ వేడుకలను నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ
బడుగు, బలహీన వర్గాల కోసం న్యాయపరంగా, చట్టపరంగా గొంతెత్తి వారి పక్షాన నిలిచారని, ప్రజల సేవకే తన జీవితాన్ని అర్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రం తొలి, మలిదశ ఉద్యమంలో అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పోరాటం చేసిన సమరయోధుడని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అధికారికంగా ఆయన జయంతి జరుపుకోవడం హర్షణీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఆవిర్భావానికి తహతహలాడిన యోధుడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం కోసం తన మంత్రి పదవిని త్యజించారని , ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తహతహలాడిన మహానీయుడని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలన్నారు.

మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలుఅనిర్వచనీయమైనవన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టడం లో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. నేతన్నలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ దన్నారు. కుల వృత్తులు సజీవంగా ఉండటానికి అకుంఠిత దీక్షతో పని చేసిన మహనీయుడని, వారి
సేవలను ఎల్లవేళలా మననం చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కేశురాం, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, జెడ్ పి టి సి మనోహర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు విజయలక్ష్మి, వీణా శ్రీనివాస్, నాని, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మహేష్ , రమేష్ చౌహాన్, కూన వేణుగోపాల్, నామ నగేష్, జనార్ధన్ ,రాములు మల్లేశం ,సత్యం, గోలి యాదగిరి, సోమశేఖర్, రాములు నేత, సిద్దేశ్వర్ చంద్రశేఖర్,బూర మల్లేశం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సహాయ అధికారి భాగ్యలక్ష్మి, ఏవో వెంకట నరసమ్మ ,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post