తెలంగాణ ప్రభుత్వం అనాధ చిన్నారులకు అండగా నిలుస్తుందని, వారి బంగారు భవిష్యత్ కొసం త్వరలో కొత్త పథకం తీసుకోరానున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

పత్రిక ప్రకటన,
వికారాబాద్ జిల్లా.

తెలంగాణ ప్రభుత్వం అనాధ చిన్నారులకు అండగా నిలుస్తుందని, వారి బంగారు భవిష్యత్ కొసం త్వరలో కొత్త పథకం తీసుకోరానున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అనాధల భవిష్యత్ కొసం కాబినెట్ సబ్-కమిటీ వేసిన నేపథ్యంలో సోమవారం పరిగిలోని బాలసాధనాన్ని మంత్రులు సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్య, భద్రతతో పాటు అన్ని విషయాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. పలు విషయాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వల్సి ఉంటుందన్నారు. కోవిడ్ వల్ల అనాధలైన చిన్నారులను ప్రభుత్వమే చూడాలనే ఉద్యేశ్యంతో వారికి మంచి ఉన్నత విద్యానందించి వారిలో మానసిక ధైర్యాన్ని నింపాలన్నదే ప్రభుత్వ ఉద్యేశ్యం అన్నారు. పరిగిలోని బాలసధనాన్ని మంత్రులు సందర్శించారు. బలసదనంలో వసతులు, పిల్లల ఆరోగ్యం, విద్యా సదుపాయాలు, ఆహారం తదితర అన్ని అంశాలను మంత్రులు పరిశీలించి, స్వయంగా విద్యార్ధినులతో మాట్లాడి తెలుసుకున్నారు.
అనాధ పిల్లలకు అమ్మ నాన్న ప్రభుత్వమే కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అనాధ పిల్లల చదువు, వారికి పూర్తిగా భరోసా కల్పించే దిశగా నీవేదిక ఉండేలా రిపోర్ట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శాసనసభ్యులు తమ పరిధిలో ఉన్న ఆశ్రమాలను సందర్శించి అనాధ పిల్లల అన్ని విషయాలను తెలుసుకొని కమిటీకి తెలియ జేయాలనీ మంత్రి కోరారు. పరిగి బలసదనంలో 29 మంది బాలికలతో మంత్రులు మాట్లాడి వారికి ధైర్యం కల్పించి, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారు.
ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు మహేష్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post