తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమములో పాఠశాల భవనాల మరమ్మతుల పనులను వేగవంతం చేసి ప్రారంబానికి సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు

పత్రిక ప్రకటన                                                                 తేది : 20.01.2023

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమములో పాఠశాల భవనాల మరమ్మతుల పనులను వేగవంతం చేసి ప్రారంబానికి సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఇటిక్యాల మండలం కొండేరు గ్రామం లో మన ఊరు మన బడి కార్యక్రమములో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాల , మూడు అంగన్వాడి సెంటర్ లను కలెక్టర్ పరిశీలించారు. మన ఊరు మన బడి కార్యక్రమములో భాగంగా చేప్పట్టిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరింగ్ , టాయిలెట్స్ ,కిచెన్ షెడ్ కలరింగ్  వాటినన్నింటినీ పరిశీలించి కలరింగ్ , టైల్స్ వేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చెయ్యాలన్నారు. పాఠశాల లో ఉన్న కంపౌండ్ లో పచ్చదనం ఉండేలా  మొక్కలు నాటించాలన్నారు. పాఠశాల లో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.

అనంతరం ఇటిక్యాల సబ్ సెంటర్  , వల్లూరు గ్రామ పంచాయితీ కార్యాలయం  లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరాన్ని తనిఖి చేశారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంత మందికి కంటి స్క్రీనింగ్ చేశారు , కంటి అద్దాలు ఎంత మందికి పంపిణి చేసారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఇటిక్యాల సబ్ సెంటర్   లో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1875 మంది ఉన్నారని , 10 రోజులు క్యాంపు నిర్వహిస్తారని,  ఆశ వర్కర్లు ఇంటింటికి తిరిగి అందరికి  కంటి వెలుగు కార్యక్రమం గురించి అవగాహన కల్పించి సెంటర్ కు తీసుకురావాలని అన్నారు.    డేటా ఎంట్రీ కరెక్ట్ గా  చేయాలనీ, అవసరమైన మందులు అన్ని సిద్దంగా ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అన్నారు.  అవెన్యూ ప్లాంటేషన్ చేసి గ్రామ  అభివృద్ధికి కృషి  చెయ్యాలని ఇటిక్యాల  ఎంపిడిఓ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమములో జిల్లా వైద్యదికారి డాక్టర్  శశికళ , స్రవంతి,  ఇటిక్యాల తహసిల్దారు  సుబ్రహ్మణ్యం, ఎం పి డి ఓ రాఘవ , పంచాయతి సెక్రటరి లు నాగరాజు, దిలీప్ రెడ్డి,  , సర్పంచులు  సరోజమ్మ, యేసన్న, ఎం ఇ ఓ రాజు, డి ఇ లు   తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచే జారి చేయబడినది.

 

Share This Post