పత్రికా ప్రకటన తేది 02-9-2021
జోగులాంబ గద్వాల
తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నూతన కలెక్టర్ కార్యాలయం, క్యాంపు ఆఫీస్, సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టర్, సమీకృత కార్యాలయ భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లంబింగ్, విద్యుత్ సౌకర్యం, ఇతర ఇంటర్నల్ పనులన్నీ పూర్తి చేసి , భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ గారితో పాటు ఆర్ అండ్ బి ఇ ఇ ప్రగతి, డి ఇ కిరణ్ కుమార్, ఏ ఇ రాజేశ్వరి, ఏజెన్సీ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
————————————————————————————————జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.


