పత్రికా ప్రకటన తేది 09-09-2021
తెలంగాణ ప్రభుత్వం మత్స్య కారుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని జిల్లా శాసనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
గురువారం గద్వాల నియోజకవర్గంలో సంగాల చెరువులో మత్స్య కారులకు ఉచితంగా చేపలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారు హాజరయ్యారు. చెరువులో గంగమ్మ పూజ చేసి సంగాల చెరువులో 2లక్షల చేపల ను వదిలారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వందశాతం రాయితీపై మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా చేసిందన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మిగిలిన రాష్ర్టాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నదులు, సముద్రాల శాతం తక్కువ అని అయినా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుని చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అన్ని చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి చేపపిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని చెరువులు, కుంటలలో చేపపిల్లలను విడుదల చేసిందన్నారు. చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి రవాణ చేసుకోవడానికి మత్స్యకారులకు రాయితీతో కూడిన ద్విచక్రవాహనాలు,ఆటోలు అందించిందన్నారు. మత్స్యకారుల కార్మికులకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అని అధికారులకు ఆదేశించారు. చేపలు అమ్ముకోడానికి మండలాలలో మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, మత్స్య శాఖ అధికారి రుపెందర్ సింగ్ , జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, నజూమన్నీ బేగం, మనోరమ్మ , జెడ్పీటీసీ రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీను, మార్కెట్ వైస్ చైర్మన సంజీవులు, , అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది

