తెలంగాణ ప్రభుత్వం వారు తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పోరేషన్ ద్వారా ఆర్తోపెడికల్, విజువల్, ఇయర్ రింగ్ లోపము కలిగిన దివ్యాంగులకు క్రింది సహాయ ఉపకరణాలను శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది

తెలంగాణ ప్రభుత్వం వారు తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పోరేషన్ ద్వారా ఆర్తోపెడికల్, విజువల్, ఇయర్ రింగ్ లోపము కలిగిన దివ్యాంగులకు క్రింది సహాయ ఉపకరణాలను శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు హాజరై బోనఫైడ్ విద్యార్థులు మరియు నిరుద్యోగులైన ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్ వారికి 17 మంది కి retrofitted మోటార్ వెహికల్స్ మరియు ఎనిమిది మందికి క్రచేస్, spinal cord injury తో బాధపడుతున్న తొమ్మిది మందికి బ్యాటరీ వీల్ చైర్స్ బోనఫైడ్ విద్యార్థులైన నలుగురు విజువల్ హ్యాండ్ క్యాప్ వారికి ల్యాప్టాప్లను, విజువల్ హ్యాండీక్యాప్డ్ అయినవారికి ఒక స్మార్ట్ కేన్ మరియు వినికిడి లోపం కలిగిన 19 మందికి హియరింగ్ ఎడ్ పరికరాలు వినికిడి లోపం కలిగిన విద్యార్థులకు నాలుగు స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేయడం జరిగింది.
శ్రీయుత జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సందీప్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్ ఐనా దివ్యాంగులకు retrofitted motorized vehicles ఎంతో ఉపకరణంగా ఉన్నదని నిరుద్యోగులకు ఉపాధి పొందుటకు మరియు విద్యార్థులు పై చదువులు చదువు కొనుటకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఇలాంటి ఇలాంటి వెహికల్స్ ను దివ్యాంగులకు సి ఎస్ ఆర్ ఫండ్స్ నుండి కూడా అందేలా చూస్తామని ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఎక్కువమంది దివ్యాంగులకు ఎకనామికల్ లోన్లు మంజూరయ్యే విధంగా చూస్తామని మరియు టి ఎస్ ఆర్ ఫాన్స్ నుండి వివిధ రకాల సహాయ ఉపకరణాలు కూడా అందజేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు మాట్లాడుతూ, నరాల బలహీనత నడవలేని స్థితిలో లో ఉన్న వారికి ఆధునిక పరిజ్ఞానంతో తయారుచేసిన బ్యాటరీ వీల్ చైర్ ఎంతో ఉపయోగ కరంగా ఉందని ఇంట్లోనే వారి పనులు ఎవరి సహాయం లేకుండా చూసుకునేలా ఉపయోగపడుతుందని, ఇలాంటి పరికరాలు ఎక్కువమంది దివ్యాంగులకు సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కూడా అందేలా చూస్తామని అన్నారు.
శ్రీయుత ఎంపీపీ భువనగిరి నిర్మల గారు మరియు జెడ్పిటిసి భువనగిరి మల్లయ్య గారు  మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా నిర్వహించి దివ్యాంగులకు సహాయం అందించాలని కోరారు.
శ్రీయుత జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి ఇ.కె కె.వి కృష్ణవేణి గారు మాట్లాడుతూ, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Share This Post