తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు

తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు

నీతి అయోగ్ ఆధ్వర్యంలో పట్టణ, ఆరోగ్య వ్యవస్థ పాలన బలోపేతం చేయడం పైన
స్థానిక సుప్రభ హోటల్ లో
గురువారం వివిధ శాఖల అధికారులతో సంప్రదింపుల కార్యక్రమం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నగర మేయర్ గుండు సుధారాణి, నీతి అయోగ్ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు,
వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, gwmc కమిషనర్ ప్రావిన్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు

ముందుగా
నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి మాట్లాడుతూ…ప్రజాప్రతినిధుల, అధికారుల భాగస్వామ్యం తో gwmc పరిధిలోని వరంగల్, హనుమకొండ జిల్లా ల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.

పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య సంరక్షణలో భాగం గా ఇటీవల 3 పర్యాయాలు మెగా హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు
.
పారిశుధ్య సిబ్బంది కి భరోసా కై భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు

మానవ వ్యర్థాల శుద్ధి కరణ లో మేకనైజ్డ్ విధానాన్ని అనుసరిస్తూ సేకరించిన మానవ మలాన్ని శుద్దికరించడానికి బల్దియా పరిధి లోని అమ్మవారి పేట లో ఇప్పటికే మానవ వ్యర్థాల శుద్దికరణ కేంద్రం (ఎఫ్.ఎస్.టి.పి)ఏర్పాటు చేసి 13 కే.ఎల్.డి.సామర్ధ్యం తో నిర్వహిస్తున్నామని..దీనికి అదనం గా 150 కే.ఎల్.డి.సామర్థ్యం గల మరో ప్లాంట్ నిర్మాణము కొనసాగుతున్నదన్నారు

కోవిడ్ వారియర్లుగా కరోనా క్లిష్ట సమయం లో సేవలందించిన పారిశుధ్య సిబ్బందికి వంద శాతం
వాక్సినేషన్ వేయించడం జరిగిందన్నారు

ప్లాస్టిక్ నిర్ములనకు అన్ని రకాల చర్యలు చెపడుతున్నామని,ప్లాస్టిక్ ను పటిష్టంగా కట్టడి చేసే చర్యల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాల పై దాడులు నిర్వహించి పెనాల్టీ లు విధించడం జరిగిందన్నారు .

బల్దియా వ్యాప్తంగా డి.ఆర్.సి.సి.కేంద్రాలను ఏర్పాటు చేసి తడి,పొడి చెత్తను గృహాల నుండి సేకరించిన చెత్తను బయో మైనింగ్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి తొలగించడం జరుగుతుందన్నారు
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు
కేటీఆర్ నేతృత్వంలో నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

కోవిడ్ నేపథ్యంలో రిసోర్స్ పర్సన్లు క్షేత్రస్థాయిలో వారియర్లుగా పని చేసి సుమారు 15200 మంది స్వయం సహాయక మహిళా సభ్యులకు వ్యాక్సిన్ ఇప్పించడం జరిగిందని ఉమెన్స్ డే సందర్భంగా బల్దియా ఆద్వర్యం లో ఒమేగా హాస్పిటల్ వారి సహకారంతో మహిళలకు ఉచితం గా క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయించడం జరిగిందని, మహిళల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని అంతేకాకుండా హనుమకొండలో 2 వరంగల్ లో 3 బస్తీ దవాఖాన లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఇటీవల వైద్య హామీ ఇవ్వడం జరిగిందన్నారు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడ మోకాలి, కీలు మార్పిడి చికిత్సలు చేయడం తో పాటు హృదయ,కిడ్నీ సంబంధ వ్యాధుల కు మెరుగైన వైద్యం అందిస్తున్నమన్నారు

తల్లి బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ అందజేయడం జరుగుతుందన్నారు

అనంతరం
కలెక్టర్ గోపి
మాట్లాడుతూ చుట్టూ ఉన్న
పది జిల్లా ల ప్రజలు వరంగల్ కు వైద్యం కోసం వస్తున్నారన్నారు

పక్క రాష్ట్రాల వారు కూడా MGM, CKM ఆసుపత్రి లలో వైద్య సేవలు పొందుతున్నరన్నారు

తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ తీసుకుని 1,100 కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్ జిల్లాలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని
మంజూరు చేసిందని..ఇందుకు దాదాపు టెండర్లు పూర్తి చేసుకుని… పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

ఒక సంవత్సరం లో సుపర్ స్పెషలిటీ ఆసుపత్రి పనులు పూర్తి అవుతాయని… ఆతరువాత వరంగల్ చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలకు మరిన్ని అదునతన వైద్య సేవలు అందనున్నాయని కలెక్టర్ తెలిపారు

రాష్ట్రం లో వివిధ కారణాలతో
పోషకహర లోపం తో బాధ పడుతున్న చిన్నారులను గత సంవత్సరం నుండి గుర్తిస్తున్నామని…ప్రతి నెల ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని
ప్రతీ నెల రివ్యూ చేస్తూ
పోషక ఆహారం లోపం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు .

MGM, pmssy ఇలా వరంగల్ లో ఉన్న అన్నీ ప్రభుత్వ ఆసుపత్రి లలో
ప్రయివేటు కు దీటుగా అదునాతన వైద్య సేవలు,
వైద్య పరికరాలు ఉన్నాయన్నారు

రెండు రోజుల క్రితం వైద్య శాఖ అధికారులతో
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారని,
పేదవారికి అందించాలిసిన వైద్య సేవల గురించి మంత్రివర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని.. ఆ మేరకు ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్యాన్ని ప్రతీ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు వైద్య శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు

ఈ కార్యక్రమం లో నీతి అయోగ్ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు,
gwmc కమిషనర్ ప్రావిన్య,PSI ఇండియా MD శంకర్ నారాయణన్
తదితరులు పాల్గొన్నారు

Share This Post