తెలంగాణ ప్రాంత తెలుగు వ్యవహారిక భాషకు సామాజికంగా ఉన్నతి కల్పించడానికి, తెలుగు భాషాభివృద్ధికి పాటుపడిన గొప్ప కవి కాళోజీ అని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 9:–
తెలంగాణ ప్రాంత తెలుగు వ్యవహారిక భాషకు సామాజికంగా ఉన్నతి కల్పించడానికి, తెలుగు భాషాభివృద్ధికి పాటుపడిన గొప్ప కవి కాళోజీ అని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి ప్రజాకవిగా పేరుగాంచారన్నారు. తెలుగు భాషను అమితంగా ప్రేమించి అందులోని మాధుర్యాన్ని అవపోషణ చేసుకున్న గొప్ప భాషా ప్రేమికుడన్నారు. తెలుగు భాష అంటే కాళోజీ అత్యంత ఇష్టపడే వారని, తెలంగాణ భాషకు ,యాసకు అస్తిత్వాన్ని కల్పించిన మహనీయుడని కొనియాడారు.

తన సాహిత్యం, రచనలతో ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా రచనలు చేశారని, తెలంగాణ సాహిత్యానికి నిదర్శనం కాళోజీ రచనలన్నారు. ఆయన పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కాలోజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post