తెలంగాణ భాష, సాహిత్యం, సాంన్ఫృతిక ఉద్యమానికి దిక్సూచి – కాళోజీ  : జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌నాయక్‌

పుట్టుక నీది – చావు నీది – బతుకంతా దేశానిది అని చెప్పిన పద్మభూషన్‌ కాళోజీ జయంతి నందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌నాయక్‌ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి గురువారం పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సoదర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ భాష, సాహిత్యం, సాంన్ఫ్కతిక ఉద్యమానికి కాళోజీ దిక్సూచిగా నిలిచారని, ఆ మహనీయుడు నూచించిన మార్గాన్ని అందరు అనునరించాలని, జనంలో నిలిచిపోయిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు. నా గొడవితో తన అంతరంగాన్ని కవిత్వం ద్వారా ప్రజలకు తెలియజేయశారని, మార్చు కోనం విశేషంగా కృషి చేశారని, మాతృభాష కన్న తల్లి లాంటిందని చాటి చెప్పారని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను తన రచనలతో వైతన్యం చేసి న్ఫూర్తి నింపి ముందుకు నడిపించిన వ్యక్తి అని తెలిపారు. కాళోజీ చూపిన అడుగుజాడల్లో నడున్తూ ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ నందర్భంగా తెలంగాణ సాంన్ఫృతిక సారథి కళాకారులు ఆలపించిన గీతాలు పలువురిని అలరించాయి.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి నురేష్‌, భూప్రక్షాళన అధికారి నంతోష్‌, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post