తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 మేరకు పురపాలక సంఘాల పరిధిలో నిర్మాణాలు జరుగుతున్న స్థలంలో సంబంధిత పురపాలక శాఖ కమిషనర్ సంతకం చేసిన నిర్మాణ ప్లాన్, మంజూరి అనుమతి ప్రతిని విధిగా డిస్ ప్లే చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం నాడోక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని 8 మున్సిపాలిటీలలో
టి ఎస్ బి పాస్, డి పి ఎం ఎస్, తదితరాలలో ఏవైనా బిల్డింగ్ అనుమతులు తీసుకున్న తర్వాత యజమానులు నిర్మాణములో ఉన్న భవనాల వద్ద అందరికీ కనిపించే విధంగా శాశ్వత బోర్డును ఏర్పాటు చేసి అందులో మున్సిపల్ కమిషనర్ సంతకంతో కూడిన భవన ప్లాన్ కాపీ, భవన నిర్మాణ అనుమతి కాపీని డిస్ప్లే చేయాలని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి, సంబంధిత యజమానులు మంగళవారం (సెప్టెంబర్ 28) సాయంత్రంలోగా నిర్మాణ స్థలం వద్ద అనుమతులకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇకముందు (భవిష్యత్తులో) నిర్మాణాలకు అనుమతులు తీసుకున్న తర్వాత, నిర్మాణానికి ముందే ఆయా అనుమతుల కాపీలను నిర్మాణ స్థలంలో కనపడే విధంగా డిస్ప్లే చేయాలని కలెక్టర్ సూచించారు.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి నట్లయితే చట్టం మేరకు చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Share This Post