పత్రిక పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది:14-09-2021
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు – డైరెక్టర్ రాష్ట్ర యస్సి కమిషన్ డి.డి యోగితా రాణా.
కోవిడ్-19 తరువాత సెప్టెంబర్ 1 నుంచి రాష్టీంలోని అన్ని విద్యాలయాలు పునప్రారంభం అయ్యాయని, పాఠశాలలకు విద్యార్థులు సైతం చేరుకుంటున్ననందున అన్ని వసతి గృహాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలిసి జిల్లా కేంద్రంలోని యస్సి వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహాన్ని ప్రారంభించేందుకు ముందస్తు ఏర్పాట్లు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రం లోని సింగారం చౌరస్థా లో గల ఎస్సి హాస్టల్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అవసరం ఉన్న వాటికి కుళాయి లు బిగించాలని డ్రైనేజి వ్యవస్థ ను సరిచేయలని హాస్టల్ ప్రాంగణం లో పరిశుబ్రంగా ఉంచాలని అధికారులను సూచించారు. వసతి గృహం పై నీటి నిల్వలేకుండా చూడాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రం లో ఉన్న ఆనంద నీలయం (యస్సీ బాలికల హాస్టల్) ను సందర్శించి హాస్టల్ లో విద్యుత్ దీపాలను పరిశీలించారు. కిచన్ గార్డెన్ ను ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ డి హరిచందన వార్డెన్ కు సూచించారు. ఆనంద నిలయం లో ఉన్న వసతి గృహ్హాన్ని పరిశీలించారు. నారాయణపేట కంటే ముందుగ ధన్వాడ మండల కేంద్రం లోని బాలుర ఎస్సి హాస్టల్ ను పర్యవేక్షించి మరుగుదొడ్ల ఏర్పాట్ల పై హాస్టల్ లో స్నానల గదుల లో కుళాయి, వంట గదులను డైనింగ్ హాల్ లను కమిషనర్ పరిశీలించారు. మరుగుదొడ్ల లకు నాణ్యమైన కొత్త తలుపులను బిగించాలని వసతి గృహాల లో కిడికిలను బిగించి వాటికీ స్టీల్ దోమతెరను ఏర్పాటు చేయాలని వసతి గృహం పై నీటి నిల్వ ఉండకుండా వాటికి చిన్న పైప్ లైన్ ద్వారా కిందకు వదిలి వాటిని ఇంకుడు గుంతలు తరలించాలని సూచించారు. ఇంకా మరమ్మతులకు కావలసిన ప్రణాళిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని ఇంచార్జ్ ఎడి కి సూచించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, ఇంచార్జ్ ఏడి కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————-జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జారి.