తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు..

పట్టణ ప్రగతి లో భాగంగా సోమవారం రోజు మెదక్ పట్టణంలో 13వ వార్డులో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో భాగంగా వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ కు స్మశానవాటిక లను త్వరలో ప్రారంభించుకుని వాటికి నిధులు సమకూర్చుకుంటామన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్ కు జిల్లా కేంద్రం, జిల్లా కోర్టు, విస్తారమైన రోడ్లు, చౌరస్తా లు ఏర్పాటయ్యాయని త్వరలో రైలు కూడా వస్తుందని అన్నారు
జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో పట్టణ విస్తీర్ణం పెరుగుతుందని దానికనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు అందులో భాగంగా ఇంటర్నల్ రోడ్స్, మురుగు కాలువల కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( TUFIDC) ద్వారా ముఖ్యమంత్రిని నిధులు కావాలని అడగడం జరిగిందని అందుకు గాను మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావు 20 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు,ఆ నిధుల ద్వారా కనెక్టివిటీ రోడ్డు ఇంటర్నల్ రోడ్డు మరుగు కలల కోసం వినియోగిస్తామని తెలిపారు పట్టణ ప్రగతి లో భాగంగా అధికారులు కౌన్సిలర్ అన్ని వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వారికి సూచించారు.13 వార్డులో అంతర్గత సి సి రోడ్లకు 10 లక్షలు R&b రోడ్లకు10 లక్షలు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ కౌన్సిలర్ లు సులోచన ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి,రాగి. వనజ, జయరాజ్, సమియొద్దీన్, సుంకయ్య నాయకులు ప్రభు రెడ్డి,రాగి అశోక్, లింగారెడ్డి, సుమన్, కృష్ణ, మధు,సునీల్ మునిసిపల్, సిబ్బంది, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post