తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా వరంగల్ ఎంజీఎం లో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పరిరక్షణ కై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా వరంగల్ ఎంజీఎం లో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పరిరక్షణ కై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
మంగళవారం రోజున వరంగల్ ఎంజీఎం లో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లీనిక్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి ప్రారంభించారు అనంతరం వైద్య సిబ్బంది తో కలిసి క్లినిక్ ను పరిశీలించారు అనంతరం ట్రాన్స్ జెండర్ తో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాల ట్రాన్స్ జెండర్స్ ఏ కాకుండా పక్క రాష్ట్రాల నుండి ఎంజీఎం కు విచ్చేసి ప్రతి మంగళవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్లినిక్ లో ఓపి సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు ప్రత్యేకమైన వైద్య నిపుణులతో వారికి ఆరోగ్య పరిరక్షణ కై ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు గతంలో జిల్లా అధికారులతో ట్రాన్స్జెండర్స్ సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై స్వయంగా తెలుసుకోవడం జరిగింది అని చెప్పారు ఈ సమావేశంలో వారు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అని దారిద్య రేఖకు దిగువన ఉన్న ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర నాయకురాలు లైలా సూచించిన మేరకు వారి సమస్యలను ఒక్కొక్కటి గా పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు ప్రత్యేకంగా ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంట్ వైద్య సిబ్బంది తో
క్లినిక్ ఏర్పాటు గురించి వారికి చెప్పగానే ట్రాన్స్జెండర్స్ కోసం క్లినిక్ తొందరగా ఏర్పాటు చేసి
వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంజీఎం ఆసుపత్రి నాణ్యమైన వైద్య సేవలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని అన్నారు. భవిష్యత్తులో ట్రాన్స్ జెండర్స్ లేజర్ ట్రీట్మెంట్ గాని సర్జరీలు హార్మోన్ ట్రీట్మెంట్ అవసరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పారు
ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర నాయకురాలు లైలా మాట్లాడుతూ వరంగల్ జిల్లా ట్రాన్స్ జెండర్ సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ మా సమస్యలపై పరిష్కార మార్గాలు వెతికారు అని ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయడం వరంగల్ హనుమకొండ జిల్లాల ట్రాన్స్ జెండర్స్ కు శుభపరిణామం అని చెప్పారు గతంలో హెల్త్ పరంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయిన వారు ఉన్నారని మా ఆరోగ్య సమస్యలపై ప్రైవేట్ డాక్టర్లతో వైద్య చికిత్సలు పొంది అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డామని అన్నారు వరంగల్ హనుమకొండ జిల్లా లే కాకుండా పక్క రాష్ట్రాల నుండి వచ్చే ట్రాన్స్ జెండర్ కూడా ప్రతి నెలలో మంగళవారం ఎంజీఎంలో వైద్య సేవలు పొందాలని సూచించారు
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ , ఇవి ఈ శ్రీనివాసరావు ఎంజీఎం సూపరిండెంట్ వైద్య సిబ్బంది

Share This Post