తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయటంలో కేంద్ర ప్రభుత్వం తరఫన అందిస్తా:: కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక ఈశా న్య అభివృద్ధి శాఖా మాత్యులు జి. కిషన్ రెడ్డి

 

ప్రచురణ*
ములుగు జిల్లా అక్టోబర్ 21( గురువారం )

తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయటంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక ఈశా న్య అభివృద్ధి శాఖా మాత్యులు జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
గురువారం రోజున ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రివర్యులు మొట్టమొదటి సారి జిల్లాకు విచ్చేసిన మంత్రివర్యుల కు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ సంగ్రామ్ సింగ్ ,పాటిల్ టూరిజం అధికారులు పుష్ప గుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో ఉన్న గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు. వేద మంత్రాలతో పూర్ణకుంభంతో పురోహితులు స్వాగతం పలికి మంత్రివర్యుల కు గిరిజన నాయకపోడు ఆరాధ్యదైవమైన గట్టమ్మ దేవతను దర్శనం చేసుకున్నారు. అనంతరం జిల్లాలో టూరిజం హరిత హోటల్ ను ప్రారంభించారు వెంకటాపూర్ మండల్ పాలంపేట గ్రామంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి అతి ప్రాచీన పురాతన రుద్రేశ్వర రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్, ములుగు శాసనసభ్యులు ధన సరి అనసూయ సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికి రుద్రేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించారు. అర్చకులు వేద మంత్రాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పర్యాటక రంగంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో టూరిజం అధికారులు, పురావస్తు శాఖ అధికారులతో చర్చించారు.

అనంతరం ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ మరియు ప్రజా మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక ఈశాన్య అభివృద్ధి శాఖ మాత్యులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామప్ప దేవాలయాన్ని సందర్శించగా కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి ఆ నాటి ఇంజనీరింగ్ కట్టడాలకు ఒక నిదర్శనం అన్నారు. రామప్ప ఆలయం ములుగు జిల్లా లో ఇంత మంచి పర్యాటక కేంద్రాలు ఉండటం సందర్శకుల తాకిడి ఎక్కువ ఉండటం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రామప్ప ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ములుగు గేట్ వే,లక్నవరం ,మేడారం, తాడ్వాయి,దమరవాయి, మల్లూరు,బొగత వాటర్ ఫాల్స్, అభివృద్ది కి నిధులు కేటాయించామని వారు అన్నారు. కేంద్ర ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో వివిధ కంపెనీలతో స్వయంగా సంప్రదించి వ్యాక్సినేషన్ తయారుచేయించి 18 సంవత్సరాలు పైబడిన వారికి ప్రజలందరికీ ప్రపంచంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన దిశగా ప్రజలందరికీ ఫస్ట్ సెకండ్ డోస్ అందించారని తద్వారా ప్రజలంతా ధైర్యంగా ముందుకు వచ్చి రోజువారి తమ దైనందిక కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నారని అన్నారు ఈ వ్యాక్సినేషన్ ఇంత సమర్థవంతంగా నిర్వహించిన ప్రభుత్వ వైద్యాధికారులకు నర్సులకు పారామెడికల్ సిబ్బంది కి అందరికీ ధన్యవాదాలు తెలిపారుg త్వరలో 12 సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు రామప్ప దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా చూస్తున్నామన్నారు పర్యాటక వసతులకు గురించి నిధులు సమకూర్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసి టూరిజం నుండి సబ్సిడీతో అతితక్కువ విమాన చార్జీల తో టూరిజం ప్రాంతాలను సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలో కాకతీయుల కట్టడాలు శిల్పకళా నైపుణ్యం లు పరిరక్షించుకోవాలని నేటి యువతరానికి వాటి గురించి తెలియ చెప్పాలి అని మంత్రి గారు అన్నారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు కల సాకారమైన రోజని పర్యాటక రంగ అభివృద్ధి లో ఆయన విశేష కృషి చేస్తున్నారని టూరిజం మినిస్టర్ గా నన్ను ఇక్కడికి పంపించారని అన్నారు కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి కృషిచేసిన విద్యావతి గారికి జిల్లా పాలనాధికారి కృష్ణ ఆదిత్య గారికి మరియు టూరిజం అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఎంతో గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు కాకతీయుల కాలం నాటి చెరువులు దేవాలయాలు మన సంస్కృతికి నిదర్శనాలు అని రామప్ప టెంపుల్ అద్భుతమైన చరిత్ర గలదని తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు అభివృద్ధిపై ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేక దృష్టి సారించాలని టూరిజం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి తద్వారా అభివృద్ధిని చెందే దిశగా అడుగులు వేస్తామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు అలాగే కాకతీయ సర్క్యూట్ అభివృద్ధిలో చేసే దిశగా చర్యలుతీసుకుంటున్నామన్నారు.

ములుగు శాసనసభ్యులు ధన సరి అనుసూయ మాట్లాడుతూ పురాతన రామప్ప ఆలయానికి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయటంలో తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రొఫెసర్ పాండురంగారావు గారి సేవా దృక్పథం అమోఘమైనది అని ఈ ప్రాంతానికి కేంద్రమంత్రి రావడం శుభసూచకమని ఈ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం ములుగు జిల్లా ఉన్నదని అత్యధిక పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఇదేనని గోదావరి పరివాహక ప్రాంతం ఉందని దేవాదాయ తుపాకులగూడెం అన్నారం బ్యారేజ్, బొగత జలపాతం మొదలగు పర్యాటక ప్రాంతాలు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కేంద్రం తరఫున నిధులు మంజూరు చేసినట్లయితే పర్యాటక ప్రాంతాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయవచ్చునని అన్నారు రామప్ప ఆలయ పరిసరాల్లో ప్రజల సౌకర్యాలను విత్ వన్ డ్రైనేజీ, టాయిలెట్స్, వైద్య సదుపాయాలు నిమిత్తం ఒక ఆసుపత్రి ఇవన్నీ ఏర్పాటు చేయుటకు ఐఏఎస్ అధికారి తో ఒక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే ములుగు గిరిజన యూనివర్సిటీ మంజూరు అయినదని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యావతి ఐఏఎస్ న్యూఢిల్లీ టూరిజం చైర్మన్, శ్రీనివాస్ గుప్తా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఎంపీపీ రజిత సమ్మయ్య, సర్పంచ్ ధోని రజిత శ్రీనివాస్, జడ్పీటిసి గై రుద్రమదేవి, ప్రొఫెసర్ పాండురంగారావు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Share This Post