తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ టవర్లు సురక్షితంగా ఉన్నాయని, వాస్తవాన్ని విశ్వాసం నమ్మకం పెంపొందించడం కోసం టెలిఫోన్ శాఖ ఈ ఎం ఎఫ్ తరంగ్ సంచార్ ప్రారంభించిందని జిల్లా అదనపు కలెక్టర్ కే. శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ టవర్లు సురక్షితంగా ఉన్నాయని, వాస్తవాన్ని విశ్వాసం నమ్మకం పెంపొందించడం కోసం టెలిఫోన్ శాఖ ఈ ఎం ఎఫ్ తరంగ్ సంచార్ ప్రారంభించిందని జిల్లా అదనపు కలెక్టర్ కే. శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.

మొబైల్ ఫోన్లు వాటి టవర్ల నుండి బహిర్గతమయ్యే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొంతమంది ప్రజలు  సందేహం వ్యక్తం చేస్తున్నారని టెలికాం టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కు నిరంతరం గురికావడం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయనే అపోహలు ఉన్నాయని అవి తమ దృష్టికి వచ్చాయని అన్నారు. గత 2021 ఆర్థిక సంవత్సరంలో డాట్ హైదరాబాద్ వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల 4245 మొబైల్ టవర్లను పరీక్షించిందని, అన్ని మొబైల్ టవర్లు అనుమతించదగిన సురక్షిత పరిమితుల లోనే ప్రసరించు తున్నాయని తెలిపారు. పరిమితికి మించి ఉన్న ఒక్క మొబైల్ టవర్ కూడా తరువాత నిబంధనలకు లోబడి ప్రసరించాయి.ఈ సంవత్సరం ఇంకా దాదాపు 4275 మొబైల్ టవర్లు ఈ ఎం  ఎఫ్ రేడియేషన్ స్థాయిల కోసం తనఖి చేయబడుతున్నాయి అని అన్నారు. మొబైల్ టవర్ నుండి వుధారాలను సురక్షిత ఎక్స్పోజర్ పరిమితుల్లో నియంత్రించడానికి డాట్ కఠినమైన చర్యలు తీసుకుందని అన్నారు ఐసిఎన్ఐసిఆర్ పి సూచించిన ప్రస్తుత పరిస్థితుల్లో కంటే డాట్ యొక్క ఉదార ప్రమాణాలు పది రెట్లు కఠినంగా ఉన్నాయని, దీనిని హైలైట్ చేయడం చాలా ముఖ్యమని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కంటే మన టెలికామ్ కబుర్లు చాలా మెరుగ్గా ఉన్నాయని అదనంగా మొబైల్ హ్యాండ్సెట్ల కోసం దేశంలో నిర్దేశించిన రేడియేషన్ పరిమితులు అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ టవర్లు సురక్షితంగా ఉన్నాయనే వాస్తవాన్ని ఇది తెలుపుతుందని అన్నారు. మరియు అవి ఎటువంటి హానికరం కాదు అని చెప్పే ఈ విషయంలో విశ్వాసం మరియు నమ్మకాన్ని పెంపొందించడం, ఏదైనా అపోహలు ఉంటే తొలగించడం మరియు మొబైల్ టవర్లు మరియు ఈ ఎం ఎఫ్ ఏ మిషన్ కంప్లైంస్ పై సమాచారం పంచుకోవడం కోసం వెబ్ పోర్టల్ అయిన తరంగ సంచార్(https://tarangsanchar.gov.in) ను  డాట్ ప్రారంభించింది. ఈ పోర్టల్ పబ్లిక్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని, ఎక్కడ ఏదైనా ప్రాంతం సమీపంలో మొబైల్ టవర్ల ను వీక్షించడానికి సులభమైన మ్యాప్ ఆధారిత సెర్చ్ ఫీచర్ ఉందన్నారు. ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా మొబైల్ టవర్ల ఇ ఎం ఎఫ్  సమ్మతి స్థితిపై సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. వివరణాత్మక సమాచారం కోరితే వినియోగదారులకు ఈ మెయిల్ ద్వారా పంపబడుతుంది అని అన్నారు. ఇంకా కొనసాగుతున్న మహమ్మారి కరోనా సమయంలో అనేక సంస్థలు వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్, వీడియో కాల్, ఈ సేవ, ఓటిటి, ప్లాట్ఫామ్ ఈ కామర్స్, ఈ గవర్నెన్స్ సేవలు వినియోగించడం గణనీయంగా పెరిగిందని, అందువల్ల మొబైల్, బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ టెలికాం సేవలు యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. దీని కోసం సురక్షితమైన నిర్దేశిత ఈ ఎం.ఎఫ్ నిబంధనలలో మొబైల్ టవర్ మౌలికసదుపాయాల సరైన సంరక్షణ అప్గ్రేడ్ మరియు విస్తరించడం అవసరమని అన్నారు. తెలంగాణలో మొబైల్ టవర్ రేడియేషన్ సురక్షిత పరిమితుల్లో ఉందని, కాబట్టి టవర్స్ నుండి రేడియేషన్ ప్రభావాలపై ప్రజలు అనవసరమైన ఆందోళనకు, తప్పుడు అపోహలను వీడండి అన్నారు. అనవసరమైన అపోహలను తొలగించడానికి అవగాహన కల్పించడంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం క్రమం తప్పకుండా ఫీల్డ్ ఈవెంట్లో మరియు ఆన్లైన్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని  అయన తెలిపారు.

 

————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

 

 

 

Share This Post