తెలంగాణ రాష్ట్రంలో సహాకార సంఘాలు అభివృద్ధి పథంలో నిలిపేందుకు సి.యం కే.సీ.ఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .

తెలంగాణ రాష్ట్రంలో సహాకార సంఘాలు అభివృద్ధి పథంలో నిలిపేందుకు సియం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు .

మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలోని పి.ఎ.సి.యస్ ఆవరణలో 21.04లక్షల అంచనా వ్యయంతో 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం మహిళా సంఘాలకు చెక్కులను, లబ్ధిదారులకు హర్వెస్టర్లు, ట్రాక్టర్లు, డిసిసిబి ద్వారా ఉన్నత విద్య కోసం సుమారుగా నాలుగు కోట్ల రూపాయల రుణాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు గౌరవాన్ని పెంచాలని ముఖ్యమంత్రి గారు ఆశ అని మంత్రి తెలిపారు.

రైతులను లాభసాటి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రత్యేక ప్రొత్సహాకాలు అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

పామాయిల్ సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.

ఫామాయిల్ రైతులకు ప్రొత్సహకంగా ఎకరాకు 35వేలు సబ్సిడీ అందిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.

రాయపర్తి సహకార బ్యాంకు మంచి అభివృద్ధిలోకి వచ్చిందని.. రైతులందరూ రుణాలు తీసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హార్ సింగ్ ,డి ఆర్ డి ఓ పి డి సంపత్ రావు మరియు ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post