పత్రికా ప్రకటన తేదీ 29- 11- 2022
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందజేసిన ప్రభుత్వం ఎల్లప్పుడు రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంగళవారం ధరూర్ మండలం ఉప్పేరు సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం కు హాజరై 33/100 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కరెంటు కోసం రైతులు ఎంతో కష్టపడ్డారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కరెంటు కష్టాలు తీరాయని, ప్రతి ఎకరాకు నీరు పారించే విధంగా రైతులు కష్టపడుతున్నారని అన్నారు. ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా విరివిగా సబ్స్టేషన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతిపాదిత 33 కే.వి. లైను పొడవు – 2 కి.మీ. (33కే.వి. నర్సందొడ్డి ఫీడరు, 132/33 కే.వి. గద్వాల్ సబ్ స్టేషన్ నుండి ) ప్రతిపాదిత 11 కే.వి. లైను పొడవు – 6 కి.మీ.1×5 MVA 152.31 లక్షల రూపాయలు పవర్ ట్రాన్స్ ఫార్మర్ కెపాసిటీ
సబ్ స్టేషన్ పై మొత్తం వ్యయం కోటి రూపాయల తో నిర్మాణం పూర్తి అయినదని, ప్రతిపాదిత 11 కే.వి. ఫీడర్లు 11 కే.వి. ఫీడర్ల పేర్లు వరుసగా ప్రాయోజిత గ్రామాల పేర్లు – 1. వామనపల్లి 2. ఉప్పేరు 3. ఖమ్మంపాడు- 1. ఉప్పేరు 2. ఖమ్మంపాడు 3. గార్లపాడు 4. గుడెం దొడ్డి 5. మాన్ దొడ్డి 6. వామనపల్లి, గతం లో పైన పేర్కొన్న గ్రామాలు 33/11 కే.వి. ద్యాగదొడ్డి సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా చేయబడుతుందని, ప్రాయోజిత గృహ వినియోగదారుల సంఖ్య 1306 మంది ప్రాయోజిత వ్యవసాయ వినియోగదారుల సంఖ్య 1352 మంది చిట్టచివరి వినియోగదారుడి వోల్టేజి నందు మెరుగుదల 370 V నుండి 405 V వరకు ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ్, గిడ్డంగుల చైర్మన్ సాయి చందు, విద్యుత్ శాఖ ఎస్సి బాష్కర్ ,జడ్పిటిసిలు, ఎంపీపీలు.సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే జారీ చేయబడిన ది.