తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుండి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ సలహాదారులు అనురాగ్ శర్మ అన్నారు.

పత్రికా ప్రకటన

తేది: 15-8-2021

నారాయణపేట

తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుండి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి   రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ సలహాదారులు అనురాగ్ శర్మ  అన్నారు.  75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  జిల్లా కలెక్టర్ డి హరిచందన, జిల్లా యస్పి డా  చేతన, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజమ్మ , నారాయణపేట, మక్తల్   శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డ  తో కలిసి పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  జిల్లా పోలీస్ శాఖా ద్వార జిల్లా కలెక్టర్ తో కలిసి  గౌరవ వందనం స్వీకరించారు.  అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలుచుకోడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న అభివృద్ధి, సంక్షేమ పతకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.  రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ భాగిరథ, మిషన్ కాకతీయ, భురికార్డుల ప్రక్షాళన, కళ్యాణ, లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, అమ్మబడి, కే.సి.ఆర్. కిట్ డబుల్ బెడ్ రూమ్, గొర్రెల పంపిణి, పెన్షన్ లలో  గీత, చేనేత బీడీ కార్మికులు ఆసరా, ఒంటరి మహిళలు, దియంగుల  పెన్షన్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు విజవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలియజేసారు.  జిల్లాలోని వివిధ శాఖల ద్వారా అమలు చేస్తు ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాల గురుంచి గణాంకాలతో సహా వివరించారు.  దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పతాకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వంద శతం సబ్సిడీ పై వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వీటితో వారికి నైపుణ్యం  ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టి ఆర్ధిక స్వావలంబన సాధించాలని తెలియజేసారు.  దళిత బంధు పథకం అమలుకు ప్రతి ఒక్క  సహకారం అందించాల్సిన  అవసరం ఉందని కోరారు.

అననతరం   పి.డి డి ఆర్.డి.ఎ, వ్యవసాయ, మిషన్ భగీరథ, పశు  వైద్య శాఖల, చేనేత జౌళ్ళి శాఖా, నారాయణపేట జువేలారి మర్చంట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ  ల    ద్వారా ఏర్పాటు చేసిన శకటాలు చూపరులను ఆకర్షించాయి. విద్యార్థుల ద్వార నిర్వహించిన కరాటే ప్రదర్శన్  కార్యక్రమాలు చూపరులను కనువిందు చేసాయి.  పరేడ్ మైదానంలో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన ప్రభుత్వ సలహాదారులు ఏర్పాటు చేసిన వారికి అభినందనలు తెలిపి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఇంటింటా ఇన్నోవేటార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఇన్నోవెటర్లను ప్రశంసించారు.  జిల్లా అభివృద్ధిలో తమ తమ శాఖలలో విశేషంగా కృసి చేసిన జిల్లా  అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా  పత్రాలతో సత్కరించారు.   ఈ సందర్భంగా  జిల్లా లోని 16106 మంది రైతులకు 54 కోట్ల 40 లక్షల రుణమాఫీ చెక్కును రైతుల ఖాతా లో జమ చేసేటందుకు గాను జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, యల్ డి యం ప్రసన్న కుమార్ లకు  అందించారు, రెడ్ క్రాస్ ద్వార చేస్తున్న పలు సేవాకార్యక్రమాలకు గాను ఆర్థికంగా తమ వంతు సహాయాన్ని అందించి వారికీ  రెడ్ క్రాస్  పట్రాన్  సబ్యత్వం ఐ డి కార్డు లను ముఖ్య అతిథు ద్వార అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు చంద్ర  రెడ్డి, అదనపు యస్పి భారత్,  జిల్లా అధికారులు. అర్దిఒ లు, పోలిస్ అధికారులు, వివిధ శాఖల నుండి వచ్చిన సిబ్బంది, విద్యార్థులు,  జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

—————————

జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జారి.

Share This Post