ప్రచురునార్ధం
వరంగల్ జిల్లా:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అన్నారు
ఇందులో భాగంగా శనివారం రోజున రైతు దినోత్సవ సందర్భంగా ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. గతం లో నిత్యం కరెంటు కోతలతో మోటర్లు కాలిపోయేవి, ఐదు గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి అని గుర్తు చేసారు
గతంలో బోర్లు కూడా పడని నేలలో కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాల పెరిగాయన్నారు
దేశం లో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు
ఒకప్పుడు రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్ల దిగుబడి పెరిగింది
57,801 కోట్ల రూపాయల రైతుబంధు ఇప్పటివరకు ఇచ్చాం.
4,339 కోట్ల రూపాయలు రైతు బీమా ఇచ్చామన్నారు
ప్రతీ 5 వేల ఎకరాలకి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి AEO లను నియమించమన్నారు
13 కోట్లతో జిల్లాలో 59 రైతు వేదికలను నిర్మించామన్నారు
తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి వచ్చిన తర్వాత ఎలా ఉందో రైతులు బేరోజు చేసుకోవాలన్నారు
రైతు లు పండించిన ప్రతీ గింజ కొంటున్నామన్నారు
జూన్ 15 లోపు అలాగె నవంబర్ 10 లోపు నాట్లు వేసుకుంటే… అకాల వర్షం వల్ల పంట నష్టం అవ్వదన్నారు
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు సాధించే క్రమంలో రాష్ట్రం ముందుందన్నారు
24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని వారన్నారు. సాగునీటి వనరులు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రమని… మన ముఖ్య మంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు
మన రాష్ట్రంలో పండిన పత్తిని బయటి దేశాలకు కూడా పంపించడం జరుగుతుందని, మునుముందు పత్తి రిసోర్స్ సెంటర్ , స్పైసీ రిసోర్స్ సెంటర్, వెజిటేబుల్ ఫ్రూట్ మార్కెట్, అలాగే ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని… ఈ ఉత్సవాలలో తెలంగాణకు రాష్ట్రం రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వo అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అవగహన కల్పించాలన్నారు
ప్రమాదవశాత్తు రైతు మరణించినట్లయితే రైతు బీమా ద్వారా ఐదు లక్షలు ఇచ్చి ప్రభుత్వం రైతు కుటుంబానికి అండగా నిలుస్తోందన్నారు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ
రైతులకు ఎవరైనా నష్టం కలిగించినట్లయితే రైతుల పక్షంలో న్యాయం చేసేందుకు పోలీస్ యంత్రాంగం పక్షాన న్యాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధం గా ఉంటామన్నారు
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ… తెలంగాణ వ్యవసాయం రంగం దేశం లోనే ఒక మాడల్ గా, స్ఫూర్తి దాయకంగా అభివృద్ధి జరిగిందన్నారు
.
2014 కంటే ముందు జిల్లా లో 1 లక్ష 72,800 ఎకరాలసాగు విస్తీర్ణం ఉండగా . ఇప్పుడు 3 లక్షల ఎకరాల కు పెరిగిందని..
గతం లో కంటే
ఇప్పుడు ఇంకా వ్యవసాయం రంగం పుంజుకుందన్నారు
78560 ఎకరాలకు అప్పుడు సాగు నీరు అందితే ఇప్పుడు 2,11,650 ఎకరాల కు దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల సాగు నీరు అందుతుందన్నారు
24 గంటల ఉచిత కరెంట్,రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాల తో వ్యవసాయం రంగం లో చాలా ప్రగతి కనపడుతుందన్నారు
వరి ధాన్యం గతంలో 83,294మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 3 లక్షల 34,400 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ను ప్రభుత్వం కొంటుందన్నారు
రైతు బంధు ప్రారంభం అయినప్పటి నుండి మన వరంగల్ జిల్లాలో 1300 కోట్లు రైతు బంధు,100 కోట్ల రైతు బీమా అందజేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా ఏనుమాముల మార్కెట్ ను చూసినట్లు అయితే 2014 నుండి ఇప్పటి వరకు 60 కోట్లతో వివిధ రకాల సౌకర్యాలను మెరుగు పరిచేందుకు ఏర్పాటు చేశామన్నారు
వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి చూస్తూ యావత్ భారత దేశం విస్తు పోతోందన్నారు
తూర్పు ఎమ్మెల్యే నన్నప్పునేని నరేందర్ మాట్లాడుతూ ఎనుమాముల మార్కెట్ యార్డులో ఐదు వేల మంది కార్మికుల కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక బస్తి దావకాలను ఏర్పాటు చేస్తామని అలాగే 10 కిలోమీటర్ల మేర రోడ్లను సీఎం గారి నిధులతో రోడ్ల నిర్మాణం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రవీందర్ రెడ్డి, ఏనుమాముల మార్కెట్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి,, అదనపు కలెక్టర్ లు,ఎనుమాముల మార్కెట్ అధికారులు ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.