తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న దారిద్య్ర రేఖకు దిగువన గల నిరుపేదల నివాస స్థలాలను క్రమబద్దీకరించేందుకు సమగ్ర సమాచార సేకరణ వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులకు సూచించారు.

ప్రచురణార్ధం

మే 23 ఖమ్మం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న దారిద్య్ర రేఖకు దిగువన గల నిరుపేదల నివాస స్థలాలను క్రమబద్దీకరించేందుకు సమగ్ర సమాచార సేకరణ వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా. స్థాయి అధికారులు తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు నెం 58 59 ప్రకారం 2014, జూన్-2 వ తేదీనాటికి ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న దారిద్య్ర రేఖకు దిగువన గల నిరుపేదల నివాస స్థలాలను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమాచారం. సేకరణకు గాను జిల్లా స్థాయి అధికారి నేతృత్వంలో 50 బృంధాలను నియమించడం జరిగిందని, ఇట్టి అధికారుల బృందం తమకు ఇచ్చిన మోబైల్ యాప్లో పొందుపర్చబడిన అంశాలకు సమగ్ర సమచారాన్ని సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అన్నారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 10 వేలు దరఖాస్తులు అందాయని, వీటిలో అధికంగా ఆరువేలకు పైగా ఖమ్మం నగర పరిధిలో ఉన్నాయని, ఇట్టి దరఖాస్తులననుసరించి, ఆయా ప్రాంతాలలో క్షేత్ర పర్యటన చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నివాస స్థల పరిధి 125 చదరపు అడుగులకు పరిమితం చేయబడిందని, అదేవిధంగా నివాస ప్రాంతంలో కమర్షియల్ భవనాలు ఉన్న యెడల వాటిని ప్రభుత్వ ఉత్తర్వు నెం. 59 ప్రకారం ప్రత్యేకంగా ‘నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి సమాచారం. సేకరణలో భాగంగా వారి ఇంటి పన్ను రశీదు, విద్యుత్ చార్జీల బిల్లు, ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్ల పరిశీలన చేయాలని, అదేవిధంగా వృత్తిపరంగా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సరిచూడాలని, అదేవిధంగా అద్దెకు ఉంటున్నవారి వివరాలు, నివాసం ఉంటున్న కట్టడం జరిగిన తేది తదితర అంశాలను క్షుణ్ణంగా సమాచార సేకరణలో పొందు పర్చాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎస్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారులు రవీంద్రనాద్, సూర్యనారాయణ, సంబంధిత తహశీల్దార్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post