తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు అన్ని సదుపాయాలు ఉండే విధంగా అభివృద్ధిపరచడం జరుగుతుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం   కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు అన్ని సదుపాయాలు ఉండే విధంగా అభివృద్ధిపరచడం జరుగుతుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో స్థానిక శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పి చైర్మన్ వనజమ్మ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.  రూ. 1.40 కోట్ల అంచన నిధులతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.  రూ. 47.50 లక్షలతో నిర్మించిన మున్సిపాలిటీ డంపింగ్ యార్డు, తడి చెత్తతో వర్మికంపోస్టు తయారు చేసేందుకు నిర్మించిన షెడ్ ను ప్రారంభించారు.  రూ. 47.50 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ప్రారంభోత్సవం చేశారు.  రూ. 2.00 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.  రూ.43.20 లక్షలతో కొత్తగా నిర్మించిన పురపాలక సంఘం సమావేశ మందిరాన్ని ప్రారంభోత్సవం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు 70 సంవత్సరాల్లో తెలంగాణా ఎలా ఉంది ఆ తర్వాత ఏ స్థాయిలో అంభివృద్ధి సాధిస్తుందో గమనించాలని పేర్కొన్నారు.  మక్తల్ మున్సిపాలిటీలో ఏ ఒక్క సౌకర్యం లేకపోయేదని,   ఈ రోజు పట్టణ ప్రజలకు సెదతీరేందుకు చెరువు దగ్గర  మినీ ట్యాంక్ బండ్, మున్సిపల్ కౌన్సిల్ హాల్, సమీకృత మార్కెట్ ఇలా ఎన్నో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.  రూ. 55 లక్షలతో మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణానికి సిద్ధం చేసిన  ప్రతిపాదనలకు ఆమోదం లభించనుందని తెలియజేసారు.  కౌన్సిలర్లు, అధికారులు అందరూ కలిసిమెలిసి పని చేసి మక్తల్ మున్సిపాలిటికి సకల సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన వాతావరణం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీలో మౌళిక వసతులు ఏవి ఉండేవి కావని, మున్సిపాలిటీ కార్యాలయం గ్రామపంచాయతీ భవనంలో ఉండేదన్నారు.  మున్సిపాలిటికి కావలసిన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు వెంటనే అనుమతులు మంజూరు చేసారని తెలిపారు.  ఈ రోజు మినీ ట్యాన్క్ బండ్, డంపింగ్ యార్డు, తడి పొడి చెత్తను వెస్ట్ మెనేజ్మెంట్ సిస్టం ద్వారా రీసైక్లిన్ చేసే విధంగా షెడ్లు , సమీకృత మార్కెట్ , కౌన్సిల్ హాల్ తడితరములు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందన్నారు.  కొత్త మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణానికి రూ. 55 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని త్వరగా ఆమోదం లభించేవిధంగా చూడాలని మంత్రివర్యులను కోరారు.  కౌన్సిలర్లలో  ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ వనజమ్మ, అదనపు కలెక్టర్ పద్మజా రాణి, మున్సిపల్ చైర్మన్ పావని,వైస్ చైర్మన్ అఖిల, మార్కెట్ యార్డు చైర్మన్ రాజేష్ గౌడ్, డి.సి.సి.బి. చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, కౌన్సిలర్లు,  ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post