తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆన్నీ విధాలుగా వెనుకబడ్డ కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి ద్వారా రూపు రేఖలు మార్చడం జరిగిందని రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, పురపాలక అభివృద్ధి శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆన్నీ విధాలుగా వెనుకబడ్డ కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి ద్వారా రూపు రేఖలు మార్చడం జరిగిందని రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, పురపాలక అభివృద్ధి శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు.  శనివారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీలో పర్యటించి రూ. 40.65 కోట్ల ఆభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.  కోస్గి  మున్సీపాలిటీలో  రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, స్థానిక శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, సహచర శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలిసి రూ.  40.65 కోట్ల  అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. రూ. 2.00 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్ డిపోను  ప్రారంభించారు.  రాష్ట్రంలో ఎక్కడ కొత్తగా బస్ డిపో ప్రారంభించలేదని కేవలం కోస్గి లో మాత్రమే బస్ డిపో మంజూరు చేసి నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కి కోస్గి పై ఎంత ప్రేమ ఉందొ, స్థానిక శాసన సభ్యులు అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందొ ప్రజలు తెలుసుకోవచ్చన్నారు. రూ.  1.40 కోట్ల నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఇంతకు ముందు కూరగాయలు అమ్మే పేదలు రోడ్డుపై అమ్ముకునే వారని ఇకనుండి దర్జాగా మార్కెట్ లో కూర్చొని అమ్ముకోవచ్చన్నారు.  ఫ్యాన్లు సైతం పెట్టించడం జరుగుతుందన్నారు.  రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో  మున్సిపాలిటీలో సి.సి. రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంఖుస్థాపన చేశారు. మరో 10 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులకు, ఒక కోటి రూపాయలతో లైబ్రరీ ఏర్పాటుకు శంఖుస్థాపన చేశారు. కోస్గి పురపాలక సంఘం పరిధిలో రూ. 9.65 కోట్ల వ్యయంతో కొత్తగా వేసిన  డ్రైనేజీ సి.సి రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. రూ. 1.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పురపాలక సంఘం కార్యాలయం, రూ. 1.2 కోట్ల నిధులతో పెద్ద పట్టణాల్లో మాదిరిగా  ఏర్పాటు చేసిన వైకుంఠ దామాన్ని ప్రారంభోత్సవం చేశారు. వైకుంఠ ధమంలో ఏర్పాటు చేసిన కాళికా దేవి విగ్రహం, వసతులపై మంత్రి అభినందనలు తెలిపారు. కోస్గి పట్టణంలో రూ. 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినీ  ఫుడ్ జోన్ ను ప్రారంభించారు.  కోస్గి ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నూతన బస్ స్టాండ్ ను రూ. 1.00 కోటి వ్యయంతో నిర్మించగా నేడు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజేయ్ కుమార్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.  రూ. 2.00 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్ కు శంఖుస్థాపన చేశారు. రూ. 50 లక్షల వ్యయంతో పట్టణ చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన అందమైన పంచతంత్ర పార్కు ను ప్రారంభించి చిన్నారులకు అంకితం చేశారు. మండుటెండలో సైతం 24 గంటల విద్యుత్తు, ప్రతి ఇంటికి తాగు నీటి నల్లా, రైతు బంధు, రైతు భీమా, దళితబంధు వంటి పతకాలు దేశంలో ఎక్కడైన ఉన్నాయా, గత ప్రభుత్వాలు అలాంటి ఆలోచనలు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు.  రైతు బంధు ద్వారా ఇప్పటి వరకు 63 లక్షల రైతులకు రూ. 50,500 కోట్లు వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.  రైతు వివిధ కారణాల వల్ల చనిపోతే రైతు భీమా ద్వారా  రూ. 5.00 లక్షలు వారి కుటుంబానికి ఇచ్చి ఆడుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.  16 వేల పైచిలుకు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. పేదింటి ఆడ కుతూరు పెళ్లికి ఒక లక్ష నూటా పదహారు ఆర్థిక సహాయం ఇప్పటి 11 లక్షల మందికి ఇవ్వడం జరిగిందన్నారు.  ప్రతి ఊర్లో నర్సరీ,  వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, ఇంటింటికి నల్లాలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది అన్నారు.  శాసన సభ్యులు కోరిక మేరకు త్వరలో ఆహార శుద్ధి పరిశ్రమలు తెచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.  ఇల్లు కట్టుకోడానికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే ప్రతి పేదవానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. మద్దూరులో డిగ్రీ కళాశాల, ముదిరాజ్ భవన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  అనంతరం మహిళా సమాఖ్య మహిళలకు బ్యాంకు ఋణాలుగా   రూ. 5.00 కోట్ల చెక్కును అందజేశారు. దళితబంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, 4 చక్రాల వాహనాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉండి అన్ని రంగాల్లో వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గానికి 350 కోట్ల నిధులతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.  నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని వారి ఉపాధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ లేదా ఐటి పరిశ్రమ మంజూరు చేయాలని కోరారు.  డిగ్రీ కళాశాల, ముదిరాజ్ భవన్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు.  ఇరుకైన రోడ్లను విస్తరణ చేసుకోడానికి మరో 65 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, బండా ప్రకాష్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్,  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ,  జడ్పి చైర్మన్ వనజమ్మ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి,  నారాయణపేట శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్చర్ల శాసన సభ్యులు లక్ష్మా రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, జడ్పిటిసిలు, ఎంపీపీ లు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post