పత్రిక ప్రకటన
తేది 30-5-2023
నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళల తాగుతేటి కష్టాలు తీరని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకం చేపట్టిన మహిళల పేరుని ప్రవేశపెట్టిన పెట్రోల్ బంక్ అని రాష్ట్ర ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో 150 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాష్ట్రానికి కరువు వలసలు తప్ప ఏమీ ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, కల్యాణలక్ష్మి, కే.సి.ఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి ఆరోగ్యవంతులు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం కే.సి.ఆర్ కిట్ ఇచ్చి 102 ద్వారా ఇంటి వద్దకు చేర్చుతున్నరని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పారదర్శకంగా జిల్లా యంత్రాంగం లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వడం జరిగిందన్నారు. జూన్ నెలలో గృహలక్ష్మి పథకం ద్వారా స్వంత స్థలం ఉన్న వాళ్లకు ఇళ్లు కట్టుకునే విధంగా నిధులు లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.
అచ్చంపేట శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పార్లమెంట్ సభ్యులు పి రాములు, జెడ్పీ చైర్మన్ శాంతకుమారి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ రైతు సేవ సమితి జిల్లా కన్వీనర్ తోకల మనోహర్ జెడ్పిటిసిలు ఎంపీపీలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు