తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని ఇందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిరంతరం పాటుపడుతున్నాడని పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి!

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్!!

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని ఇందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిరంతరం పాటుపడుతున్నాడని పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

శుక్రవారం హనుమకొండ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గత తొమ్మిది

సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేర్కొంటూ.2014 జూన్ 2 నుండి స్వయం పాలన లో మొదటి అడుగు పడిందని ఉద్యమ ఆకాంక్షలకు తెలంగాణ జూన్ రెండు 2023 వరకు 9 ఏండ్ల పాలన పూర్తిచేసుకుందని పదోఏటిలో అడుగుపెడుతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక పాలన ప్రగతి సంక్షేమం కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు నేడు తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలలో ఒక మోడల్ గా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తన నిర్మాణం దిశగా ప్రారంభమైన ఈ పయనం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పిందని, ప్రజా సంక్షేపం అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనపరుస్తూ పని చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం నేడు తెలంగాణలో సుబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లుబేరుస్తున్న సుఖ సంతోషాలే ఎందుకు నిదర్శన విద్యుత్తు వ్యవసాయం సాగునీరు సంక్షేపం విద్య వైద్యం ఇలా ప్రతి రంగంలో సాధించిన ప్రగతి నేటి నుండి 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమరులో దేశానికి ఆదర్శంగా నిలిచిన చంద్రశేఖర రావు నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని అందజేస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదు అన్నారు అదేవిధంగా 24 గంటల కరెంటు, పదివేల పెట్టుబడి వంటి పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ 2014 సంవత్సరం నుండి హ నుమకొండ జిల్లాలో దారిద్ర రేఖకు దిగువ ఉన్న రెండు లక్షల 216 ఆహార భద్రత కార్డులను అందజేయడం జరిగిందన్నారు.

మార్కెటింగ్ శాఖ , గ్రామపంచాయతీ శాఖ, క్రీడలు యువజన సర్వీసుల విద్య శాఖ జీవో 58, స్మార్ట్ సిటీ దళిత బంధు ఆరోగ్యశాఖ ఆసరా పింఛన్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఎస్సీ అభివృద్ధి శాఖ ఎస్టీ అభివృద్ధి శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతులకు అభివృద్ధి శాఖ రహదారులు భవనాలు విద్యుత్ శాఖ పరిశ్రమల శాఖ పశు వైద్య మత్స్యశాఖ ఉద్యానవన శాఖ మెప్మా,కూడా, సహకార శాఖ, స్త్రీ నిధి బ్యాంక్ డబుల్ బెడ్ రూమ్ పథకం ధరణి, పోలీస్ శాఖ రంగాలలో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ రంగనాథ్ జడ్పీ చైర్ పర్సన్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో అలరించాయి.

అనంతరం 14 మంది అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగ ఘనంగా సత్కరించారు.

Share This Post