slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. – Information and Public Relations Department, Government of Telangana

తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం దేవరకద్రలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు… తాను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదువుకున్నానని, పదో తరగతి పరీక్షలు రాసేందుకు వస్తే దేవరకద్రలో ఉండేందుకు కనీసం వసతి కూడా లభించక మసీదులో ఉండి పరీక్షలు రాశానని ఆనాటి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు కూడా సకల సదుపాయాలతో ఉచిత గురుకులాలు అందిస్తున్నారని తెలిపారు. 70 ఏళ్లలో పేదలకు మెరుగైన విద్య అందక అనేక ఇబ్బందులు పడ్డామని అన్నారు. దేశంలోనే అత్యున్నత గురుకుల విద్యను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
ఉద్యమ సమయంలోనే ఈ రాష్ట్రానికి ఏం కావాలో మేధో మథనం చేసిన ఉద్యమ నేత… ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని అమలు చేసి ఊహించని విధంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత గురుకుల విద్యను అందించడమే ఆయన సంకల్పమని ఆ దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ వచ్చాకే దివ్యాంగులకు న్యాయం జరిగిందని… వారికి రూ. 3016 పింఛన్ అందిస్తూ అండగా ఉంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి సరైన కరెంటు సాగునీరు అందక సమైక్య రాష్ట్రంలో మన జిల్లా నుంచి భారీగా వలసలు ఉండేవని… ఇప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీటి లభ్యత వల్ల బంగారు పంటలు పండుతున్నాయన్నారు. చెక్ డ్యాముల కింద ఎండాకాలం కూడా సాగునీరు లభిస్తోందన్నారు. అన్నారు వలసలు తగ్గి స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.
ఇతర రాష్ట్రాలలో ఎ రువుల కొరకు క్యూలో నిలబడే పరిస్థితి ఉన్నదని, తెలంగాణలో మాత్రం అన్నదాతలకు ఏ కష్టం లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.దనికులు, పేదలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాలను వెనుకబడిన దేవరకద్రలో ఏర్పాటు చేసేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, డా వి శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర రెడ్డి తెలిపారు. విద్యార్ధులు కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాక్షించారు. రాష్ట్రం ఏర్పడటం వల్లే వెనకబడిన ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. అనంతరం నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండలం కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం, ఎంఈఓ, అగ్రికల్చర్ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు కౌకుంట్ల మండల కేంద్రంగా వెలిసిందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి కోయిల్ సాగర్ ప్రాజెక్టుల వల్ల దేవరకద్ర నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన దేవరకద్ర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని పీజీ కళాశాలను కూడా త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి పారదర్శక పాలన వల్ల నూతన మండలాలు ఏర్పడ్డాయని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా 84 షాదీ ముబారక్ నాలుగు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, జడ్పీటిసి అన్నపూర్ణ శ్రీకాంత్, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు, ప్రిన్సిపల్ అమరేశ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post