తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెను ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెను ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని అందరూ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2న అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభమయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ముగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో  ఆధ్వర్యంలో 21 రోజులు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పదినిమిషాల పాటు ప్రతి శాఖ ఉపన్యాసం ఇచ్చేలా చూసుకోవాలన్నారు. రైతులకు శాలువాతో సన్మానం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదికలలో రైతులకు భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు సాధించిన ప్రగతిని రైతులకు వివరించాలని అలాగే అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో చెరువు కట్ట దగ్గర సహపంతి భోజనం కనీసం వెయ్యి మంది నిర్వహించేలా నీటిపారుదల  అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డి ఆర్ డి వో ద్వారా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. గ్రామంలో శానిటేషన్ పనులను చేసుకోవాలని గొర్రెల పంపిణీ నిర్వహించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాల పంపిణీ దళిత బంధు పథకం ద్వారా యూనిట్ల పంపిణీ నిర్వహించాలన్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి స్కిల్ సెంటర్లో కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలన్నారు. హెల్త్ డే నిర్వహించి నారాయణపేట మక్తల్ లలో పండ్ల పంపిణీ చేయాలన్నారు. పల్లె ప్రగతి ద్వారా సాధించిన విజయాలను ముందు వెనక జరిగిన అభివృద్ధి గురించి ఫ్లెక్సీలు గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 18న మిషన్ భగీరథ ప్రతి ఫిల్టర్ బెల్ట్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. జూన్ 20న విద్యా దినోత్సవం సందర్భంగా మన ఊరు మనబడి కింద 48 పాఠశాలల ప్రారంభోత్సవాలు నిర్వహించాలన్నారు. 21 నా జాతికా అమృత మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని 22న ముగింపు కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్,  జిల్లా గ్రామీణ అభిరుద్ది ఆదికరి గోపాల్ నాయక్, జాన్ సుధాకర్, CEO జ్యోతి, DPO మురళి

జిల్లా ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post