తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయాలి- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు పోలీసు శాఖ అధికారులకు సూచించారు.
శనివారం నకిలీ విత్తనాలపై వివిధ జిల్లాల ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున రాష్ట్రాన్ని  నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయుటకు, వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు మనమందరం నకలి విత్తనాలను ఆరికట్టేందుకు కృషి చేయాలన్నరు. కల్తీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా మనందరం కృషి చేయాలని అన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా అవగాహన కల్పించాలన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు వేసి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. మీ మీ పరిధిలోని విత్తనాలు విక్రయించే షాపుల వారిగా తనిఖీలు చేపట్టి ఎక్కడైతే నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు గుర్తిస్తే షాపులను సీజ్ చేయాలని, వారిపై కేసులు పెట్టాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కల్తీ విత్తనాలు రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి రాకుండా చెక్ పోస్టుల దగ్గర కట్టడి చేయాలని సూచించారు. మన రాష్ట్రంలో పండించే పత్తికి మంచి పేరు, గొప్పతనం ఉన్నందున దానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నకిలీ విత్తనాలు రైతుల వద్దకు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాలు అమ్మే షాప్ ను మాత్రమే కాకుండా విత్తనాలను నిల్వ చేసే గోదాములను కూడా తనిఖీ చేయాలని, గోదాములలో నకిలీ విత్తనాల నిల్వ ఉన్నట్లయితే గోదాములను సీజ్ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. రైతు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసినట్లు రశీదు పై సంతకం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు పోలీసు శాఖ అధికారులు పరస్పర సహకారంతో పని చేయాలని అన్నారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది రైతులు నకిలీ విత్తనాలు కొన్ని మోసపోకుండా నకిలీ విత్తనాలను ఆరికట్టడంలో పోలీస్ అధికారులందరు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేయాలని కోరారు.
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నకిలీ విత్తనాల రహిత రాష్ట్రంగా ఉండేందుకు చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములై లక్ష్యాన్ని నెరవేర్చే పనిచేయాలని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కల్తీ విత్తనాలు అమ్మకుండా మన రాష్ట్రంలో పండించే పత్తికి మంచి పేరుకు భంగం వాటిల్లకుండా పని చేయాలని రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఉండే షాపుల వారిగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు అరికట్టేందుకు మనమందరం కృషి చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ అనిల్ కుమార్, ఐజీపీ ఇంటలిజెన్స్ రాజేష్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, సీడ్స్ ఎండీ కేశవులు వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతా రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post