తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు-2022 కవి సమ్మేళనం

సిద్దిపేట 03 జూన్ 2022.

కవులను ప్రోత్సహించి పద్యా, వచన కవిత్వంను ముందు తరాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గొప్పదని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా గురువారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో జిల్లా అధికారయంత్రాంగం అధికారికంగా కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన జెడ్పి ఛైర్పర్సన్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాసరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవులు తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణాలో జరిగిన అభివృద్ధి పై తెలంగాణ స్ఫూర్తి పేరుతో పై కవితలను వినిపించారు. అనంతరం 68 కవులను 3 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంషాపత్రం మరియు శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా జడ్పి ఛైర్పర్సన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోశించింది సాహిత్యం మరియు కళలని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నేత్రుత్వంలోని ప్రభుత్వం సాహిత్యం అభివృద్ధికి అధికప్రాధాన్యం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సందర్బంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి జిల్లాలోని పాఠశాలలలో తెలుగు సాహిత్యం పై విద్యార్థులకు అద్భుతంగా సాహిత్యాన్ని ఉపాధ్యాయులు అందిస్తున్నారని, పద్యా, వచన కవిత్వాన్ని భవితరాలకు అందించాల్సిన అవుసరం అందరిపైన ఉన్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుల స్పూర్తితో జిల్లా అభివృద్ధికి వేగవంతంగా జరుగుతుందని అన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట కళలకు కానాచి అని, ఉద్యమలను సాచించేది సాహిత్యమని, తెలంగాణా ఉద్యమంలో సాహిత్యం, కళలు ప్రముఖపాత్ర పోషించిందని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లాలో కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరిని నగదు, జ్ఞాపక మరియు ప్రశంసాపత్రాలతో సన్మానించి కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చెన్నయ్య, ఆర్డీఓ జయచేంద్రారెడ్డి, జిల్లా బిసి అభివృద్ధి అధికారి సరోజ, జిల్లా పౌరసంబంధాల అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, సీనియర్ కవులు అష్టకాల నరసింహ రామశర్మ, ఎన్.రంగాచారి,కె. అంజయ్య, దాసరి శాంతికుమారి, అయిత చంద్రయ్య, డబ్బీకార్ సురేందర్, పొన్నాల బాలయ్య, రాజశేఖర శర్మ, ఎన్నవెల్లి రాజమౌళి, అమ్మన చంద్రారెడ్డి, ఉండ్రాల రాజేశం మరియు ఇతర కవులు మొత్తం 68 మంది పాల్గొన్నారు. మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, కలెక్టరేట్, డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట వారిచే జారీ చేయడమైనది.

Share This Post