తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

మంగళవారం సచివాలయం నుండి ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్
2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలలో ప్రజలు పెద్ద మొత్తంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చూడాలని తెలిపారు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సాధించిన అభివృద్ధి చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధి గురించి తెలియజేయగలరు గ్రామాల్లో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలని సూచించారు. గ్రామ పారిశుద్ధ్యం, పచ్చదనం తీరును వివరించాలని అదేవిధంగా జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల గురించి కూడా తెలియజేయాలని మంత్రి తెలిపారు. ఫోటోలతో పాటు బ్రోచర్ల తయారు చేసి గ్రామాలలో పంచాలని మంత్రి తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు ఉత్తమ మండలాల ఎంపీలకు సన్మాన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. గ్రామ పారిశుద్ధ్య పనులు మెరుగైన సేవలు అందించిన కార్మికులకు సన్మానించడంతోపాటు ప్రశంసా పత్రాలను ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా హర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 2వ తేది నుండి 22వ తేది వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను జిల్లాలో పండుగ వాతావరణం లో నిర్వహించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసేందుకు సన్నాహాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. తమరు సూచించిన విధంగా జూన్ 2 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రంగారావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post