తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
0 0 0 0
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
మంగళవారం సచివాలయం నుండి ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద మొత్తంలో భాగస్వామ్యం అయ్యేవిధంగా చూడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సాధించిన, అభివృద్ధి చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధి గురించి తెలియజేయగలరు. గ్రామాల్లో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలని సూచించారు. గ్రామ పారిశుద్ధ్యం, పచ్చదనం తీరును వివరించాలని అదేవిధంగా జాతీయస్థాయిలో సాధించిన అవార్డుల గురించి కూడా తెలియజేయాలని మంత్రి తెలిపారు. ఫోటోలతో పాటు బ్రోచర్ల తయారుచేసి గ్రామాల పంచాలని ఆయన తెలిపారు. ఉత్తమ గ్రామపంచాయతీల సర్పంచులకు ఉత్తమ మండలాల ఎంపీలకు సన్మాన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. గ్రామ పారిశుద్ధ్య పనులు మెరుగైన సేవలు అందించిన కార్మికులకు సన్మానించడంతోపాటు ప్రశంసా పత్రాలను ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ, మహత్మా గాంధీ గారు కన్న కలలు నేడు నిజమయ్యాయని, జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు, చెరువుల వద్ద బతుకమ్మ, బోనాల ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించి విజయవతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నుండి జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిపిఓ వీరబుచ్చయ్య, యంపిడిఓలు, ఈఈలు పాల్గోన్నారు.