You Are Here:Home→*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి* *జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి వరకు అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి*.
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి* *జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి వరకు అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి*.
జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నియమించిన పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి,నోడల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.బుధ వారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి,ఎస్.పి.అపూర్వ రావు లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి జూన్2 నుండి 22 వరకు ప్రతి రోజూ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రగతి ని,జిల్లా ప్రగతి ని చాటేలా అన్ని కార్యక్రమాలు ప్రజా ప్రతినిధుల సమన్వయం తో ప్రణాళిక బద్దంగా నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. శాఖ ల వారిగా చేపట్టబోయే కార్యక్రమాలపై స్పష్టత ఉండాలని అధికారులందరు బాధ్యత తో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖ తెలంగాణ రాష్ట్రం అవతరణ తరవాత సాధించిన జిల్లా,రాష్ట్ర స్థాయి లో విజయాలను,ప్రగతిని గతం తో పొల్చుతూ నాడు నేడు పేరిట ఫ్లెక్సీ లు ఏర్పాటు,కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలని అన్నారు.ఈ సందర్భంగా
వివిధ శాఖల ల్లో ఉత్తమ ఉద్యోగులకు సన్మానం చేయాలని అన్నారు
అనంతరం జిల్లా కలెక్టర్ టి .వినయ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఆయా రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలు సంబంధిత శాఖలు మైక్రో ప్రణాళిక సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా జూన్ 2 న జాతీయ పతాక ఆవిష్కరణ, అమరుల స్తూపం వద్ద నివాళులు ఉంటాయని అలాగే జిల్లా స్థాయిలో అమరులకు నివాళులు,రాష్ట్ర శాసన మండలి చైర్మన్ సందేశం,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూన్3 న తెలంగాణ రైతు దినోత్సం కార్యక్రమంలో రైతు వేదికలో క్లస్టర్ పరిధిలో రైతుల సమావేశం, రైతు వేదికలను పూల దండలు మామిడి తోరణాలతో అలంకరణ లైటింగ్ తో ముస్తాబు చేయాలని అలాగే వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి, రైతు బంధు, బీమా,ఉచిత విద్యుత్ పలు పథకాల విశిష్టత తెలియ చేసే విదంగా ప్లెక్సీ లు ఏర్పాటు చేయాలని రైతులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే 4న జిల్లా స్థాయిలో సురక్ష దినోత్సవం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషి, స్నేహ పూర్వక విధానాన్ని ఘనంగా వివరించాలని అన్నారు. పోలీస్ శాఖ లో జరిగిన సంస్కరణ లను,వాటి విశిష్టత లను సభల ద్వారా,కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియ చేయాలని అన్నారు
5న తెలంగాణ విద్యుత్ విజయోత్సవాలు జిల్లా, నియోజక వర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఉచిత విద్యుత్ , అన్ని సబ్ స్టేషన్స్ విద్యుత్ దీపాలతో అలంక రించాలని తెలిపారు. జూన్6 న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం లోపారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి టి.యస్. ఐ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై సాధించిన ప్రగతి ప్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అన్నారు.జూన్ 7న సాగునీటి దినోత్సవం లో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి ప్రతి నియోజక వర్గంలో వెయ్యి మంది తో సభలు ఏర్పాటు రైతులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలని అన్నారు. జూన్8 న ఊరూ రా చెరువుల పండుగ లో గ్రామ పంచాయతీలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో పెద్ద చెరువుల వద్ద చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలని అలాగే డప్పులు, బోనాలు, బతుకమ్మ, మత్య కారుల వలల ఊరేగింపుగా కొనసాగాలని కట్ట మైసమ్మ పూజలు , నీటి పూజలు చేపట్టాలని అలాగే సాంసృతిక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. జూన్ 9 న తెలంగాణ సంక్షేమ సంబురాలు నియోజక వర్గ స్థాయిలో ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, లబ్దిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా సభలు నిర్వహించాలని అలాగే లబ్ధిదారుల తో మాట్లాడించాలని సాధించిన ప్రగతి పై ప్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. జూన్10 న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్బంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు కలిగే మేలును ప్రస్తావించాలని అన్నారు. అలాగే జూన్11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి కవులు, సాహితీ అభిమానులు అలాగే ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని అన్నారు. జూన్12 న తెలంగాణ రన్ ఉదయం 6 గంటలకు యువకులు, విద్యార్థులు ప్రజా ప్రతినిధులు కార్యక్రమలో పాల్గొనేలా కార్యక్రమం నిర్వహించాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని అన్నారు. జూన్13 న మహిళ సంక్షేమ దినోత్సవం అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై సమావేశంలో వివరించాలని అన్నారు. జూన్14 తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నియోజక వర్గ స్థాయిలో kcr కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, కంటి వెలుగు, సాధించిన ప్రగతిపై కార్యక్రమం ఉండాలని అలాగే వైద్య సిబ్బంది తో అలాగే సభలు నిర్వహించాలని అన్నారు. జూన్15 న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణ , పల్లె ప్రగతి సాధించిన విజయాలు, గ్రామానికి వచ్చిన నిధులు తదితర అంశాలపై ప్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం సందర్బంగా పట్టణ ప్రగతి ద్వారా అందిన నిధులు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది తదితర అంశాల పై ఫ్లేక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. జూన్17న తెలంగాణ గిరిజనోత్సవం సందర్బంగా తండాలను గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు..గిరిజన సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు వివిధ అభివృద్ధి అంశాలపై ప్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే జూన్18 న తెలంగాణ మంచినీటి పండుగ సంధర్బంగా మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లాలు అలాగే గ్రామంలో మహిళలతో సభలు నిర్వహించాలని సూచించారు. జూన్19 న తెలంగాణ హరితోత్సవం సంధర్బంగా గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చేస్తున్న కృషిని వివరించాలని అన్నారు. జూన్20 న తెలంగాణ విద్యా దినోత్సవం సందర్బంగా విద్యా సంస్థలు నుండి విశ్వ విద్యాలయాల వరకు విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి వివరించాలని తెలిపారు. జూన్21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్బంగా దేవాలయాలు, మసీదులు, చర్చీల లో ప్రత్యేక పూజలు నిర్వకహించాలని ప్రత్యేక భక్తి, సాంసృతిక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అలాగే జూన్22 న అమరుల సంస్మరణ సందర్బంగా జి.పిలలో 11 గంటలకు సమావేశం కావాలని అలాగే అమరుల శ్రద్ధాంజలి గటించాలని అన్ని నియోజక వర్గాల్లో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు నిర్వహణ ఏర్పాట్లను వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఖుష్బూ గుప్తా, భాస్కర్ రావు,డి.ఎఫ్. ఓ రాం బాబు,
వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి* *జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి వరకు అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి*. జూన్ 2 నుండి జూన్ 22 వరకు