ప్రచురణార్థం
మహబూబాబాద్ మే 31.
జూన్ రెండవ తేదీ నుండి 22 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
బుధవారం ఐడిఓసిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
జూన్ 1వ తేదీ సాయంత్రం మున్సిపాలిటీలలోని జంక్షన్లను ప్రతి గ్రామపంచాయతీలలోనూ గ్రామ మండల జిల్లా స్థాయిలలోని ప్రభుత్వ కార్యాలయాలలోనూ విద్యుత్ దీపాలంకరణలతో మామిడి తోరణాలతో అలంకరించాలన్నారు. ఎటు చూసినా పండగ వాతావరణం కనిపించాలని ప్రతి ఒక్కరూ వేడుకలను గుర్తించేలా ఉండాలన్నారు.
జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఐ డి ఓ సి లో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరములోనికి అడుగుడుతున్న సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలో జరిగే దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించామని జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలన్నారు జూన్ మూడవ తేదీన రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 82 రైతు వేదికలను పరిశుభ్రపరచి తోరణాలతో అరిటాకులతో కొబ్బరి ఆకులతో సాంప్రదాయ సిద్ధంగా అలంకరించాలన్నారు వివిధ రంగవల్లుల ముగ్గులు వేసి రైతులకు స్వాగతం పలకాలన్నారు.
రైతులు ఉదయం 9 గంటలకు సంబంధిత రైతు వేదికల పరిధిలోని గ్రామాల రైతులు ఎడ్ల బండ్లు ట్రాక్టర్ల ను అందంగా ముస్తాబు చేసి రైతాంగం ర్యాలీగా రైతు వేదికల వద్దకు చేరుకోవాలన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు సుమారు 1000 మంది రైతులు పాల్గొనేలా అధికారులు కృషి చేయాలన్నారు.
జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభం అవుతుందని ప్రతి సమావేశంలోనూ ఆనాటి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్ది కాలం ఇంకా చేపట్టిన అభివృద్ధిని వ్యవసాయ అధికారులు ఆదర్శ రైతులు అధికారులు సమావేశంలో తెలియచేయాలన్నారు. సభలో రైతు బీమా పొందిన రైతులతో మాట్లాడించాలన్నారు ప్రభుత్వం ఆదుకున్న తీరును సమగ్రంగా వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు
రైతులు అందరికీ నాన్ వెజ్ తో కూడిన భోజనాలు ఏర్పాటు చేయించడం జరిగిందని ప్రతి ఒక్క రైతుకు తెలియాలన్నారు.
దశాబ్ది ఉత్సవాలపై గ్రామస్థాయిలోనూ మండల స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా స్థాయిలో కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వం అందజేసిన ప్రచార సామాగ్రి ఎగ్జిబిషన్లు ఫ్లెక్సీలు కరపత్రాలతో దశాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సురక్ష దినోత్సవం జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తుందని పోలీస్ శాఖ లో వస్తున్న మార్పులు సంస్కరణలు ప్రజలకు సభల ద్వారా కరపత్రాల ద్వారా వివరిస్తామని చెప్పారు.
జూన్ 5వ తేదీన తెలంగాణ విద్యుత్ విజయోత్సవం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు జూన్ 6వ తేదీన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ఉంటుందని జూన్ 7వ తేదీన నిర్వహించనున్న సాగునీటి దినోత్సవాన్ని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేపట్టినట్లు తెలిపారు.
అలాగే జూన్ 8వ తేదీన ఊరు రా చెరువుల పండగను అద్భుతంగా చేపడతామని ప్రతి ఇంట్లో జరిగిన పండుగలాగే చెరువుల వద్ద బోనాలు బతుకమ్మలు డప్పులతో మత్స్యకారుల వలలతో ఊరేగింపు చేపట్టి ప్రగతిని వివరిస్తామన్నారు జూన్ 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబరాలు ఉంటాయని అదే విధంగా 10వ తేదీన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం కూడా జరుపుతామన్నారు ఈ సూపర్ పాలన దినోత్సవం లో పరిపాలనలో సంస్కరణలు వాటి ఫలితాలు తెలియజేస్తామన్నారు జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవం ఉంటుందని కవులు తప్పనిసరిగా పాల్గొని తమ కవితలు వినిపించాలని అనంతరం కవులను సన్మానించడం జరుగుతుందన్నారు జూన్ 12వ తేదీన తెలంగాణ రన్ భారీ ఎత్తున చేపడతామని ఎన్టీఆర్ స్టేడియం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహిస్తామన్నారు క్రీడాకారులు యువత పాల్గొని తెలంగాణ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు జూన్ 13వ తేదీన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులను సన్మానించుకోవడం జరుగుతుందన్నారు జూన్ 14వ తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తామని వైద్య శాఖలో వచ్చిన మార్పులను వివరిస్తామన్నారు తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో జాతీయ జెండాలను ఎగరవేయడం జరుగుతుందని సంక్షేమ పథకాలను వివరించడం జరుగుతుందన్నారు అదేవిధంగా తెలంగాణ పట్టణప్రగతి దినోత్సవం జూన్ 16న చేపడుతున్నట్లు తెలియజేశారు జూన్ 17వ తేదీన తెలంగాణ గిరిజన దినోత్సవం కార్యక్రమం ఉంటుందని జిల్లాలో తండాలు గూడాలు సాధించిన ప్రగతిని వివరించడం జరుగుతుందన్నారు జూన్ 18వ తేదీన తెలంగాణ మంచినీళ్ల పండగ అతి వైభవంగా చేపడతామని త్రాగునీటి విశిష్టత తెలియజేస్తూ నాటి పరిస్థితులను వివరిస్తూ నేటి ఫలితాలను మిషన్ భగీరథ పథకంతో అనుభవిస్తున్నట్లు తెలియజేస్తామన్నారు. జూన్ 19వ తేదీన తెలంగాణ హరితోత్సవ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతామన్నారు జూన్ 20వ తేదీన తెలంగాణ విద్యార్థి దినోత్సవం ఉంటుందని 21వ తేదీన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం జరుపుకుంటామని జూన్ 22వ తేదీన అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా ఊరూరా జరుపుతామన్నారు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో అధికారులందరూ అంకితభావంతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ డేవిడ్ ఏ ఎస్ పి చెన్నయ్య జడ్పీ సీఈవో రమాదేవి డి ఆర్ డి ఓ సన్యాసయ్య జిల్లా నోడల్ అధికారులు సూర్యనారాయణ సుధాకర్ జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు