తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణపై గురువారం రాజేందర్ నగర్ ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియలతో కలసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయల సముదాయము నందు ఉదయం 9:00 గంటలకు ముఖ్య అతిథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిచే పతాకావిష్కరణ గావించడం జరుగుతుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు,మున్సిపాలిటీలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పతాకావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల లోగోలను పెట్టుకోవాలని ఆదేశించారు. జూన్ 3న రైతు దినోత్సవాన్ని జిల్లాలోని రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించాలని, ప్రతి రైతు వేదిక వద్ద 1000 మంది రైతులు పాల్గొనేలా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా జాగ్రత్తగా తరలించాలని అన్నారు. వాహనాలు, ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి డప్పులు, వాయిద్యాలతో ఊరేగింపుగా 10:30 గంటలకు రైతు వేదికలకు చేరుకోవాలని అన్నారు. రైతు వేదికలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు పంటలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని, అలాగే రైతులకు ప్రభుత్వం అందించిన రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై లబ్ధి పొందిన రైతులతో మాట్లాడించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకొని వెయ్యి మంది రైతులకు మంచి భోజనం పెట్టాలన్నారు. అణువైన స్థలంలో భోజన ఏర్పాట్లు చేయాలని అవసరమైన షామియానాలు, కుర్చీలు, త్రాగునీరు సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. రైతు వేదికలను అందంగా అలంకరించి పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. రైతు వేదికలలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు అన్ని అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాలన్నారు. ఇట్టి కార్యక్రమాలలో ఒక శాఖ అని కాకుండా అన్ని శాఖలు 2వ తేదీ నుండి 22 వరకు అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 4న సురక్ష దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విద్యుత్ విజయోత్సవం సందర్భంగా జూన్ 5న నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులతో వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లను 21 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని సూచించారు. ఇట్టి పనులను ఈరోజు సాయంత్రం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో చెరువుల వద్ద సాయంత్రం 5:00 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలన్నారు. చెరువులు, కార్యక్రమాలు నిర్వహించే స్థలం వివరాలను పూర్తి చేయాలని సూచించారు. డబ్బులు, బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి భోజనాలకు విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండగ ఈ రెండు కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని అధికారులందరూ పూర్తి శ్రద్ధతో ఇట్టి పనులను విజయవంతం చేయాలన్నారు.రైతు దినోత్సవం, చెరువుల పండగ పెద్ద కార్యక్రమాలు అయినందున ఎలాంటి పొరపాట్లు జరగకుండా కార్యక్రమాలను విజయవంతం చేయాలా పోలీసు శాఖ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ జిల్లా అధికారుల తోపాటు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీవోలు, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణపై గురువారం రాజేందర్ నగర్ ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియలతో కలసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయల సముదాయము నందు ఉదయం 9:00 గంటలకు ముఖ్య అతిథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిచే పతాకావిష్కరణ గావించడం జరుగుతుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు,మున్సిపాలిటీలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పతాకావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల లోగోలను పెట్టుకోవాలని ఆదేశించారు.
జూన్ 3న రైతు దినోత్సవాన్ని జిల్లాలోని రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించాలని, ప్రతి రైతు వేదిక వద్ద 1000 మంది రైతులు పాల్గొనేలా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా జాగ్రత్తగా తరలించాలని అన్నారు. వాహనాలు, ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి డప్పులు, వాయిద్యాలతో ఊరేగింపుగా 10:30 గంటలకు రైతు వేదికలకు చేరుకోవాలని అన్నారు. రైతు వేదికలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు పంటలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని, అలాగే రైతులకు ప్రభుత్వం అందించిన రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై లబ్ధి పొందిన రైతులతో మాట్లాడించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకొని వెయ్యి మంది రైతులకు మంచి భోజనం పెట్టాలన్నారు. అణువైన స్థలంలో భోజన ఏర్పాట్లు చేయాలని అవసరమైన షామియానాలు, కుర్చీలు, త్రాగునీరు సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. రైతు వేదికలను అందంగా అలంకరించి పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. రైతు వేదికలలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు అన్ని అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాలన్నారు. ఇట్టి కార్యక్రమాలలో ఒక శాఖ అని కాకుండా అన్ని శాఖలు 2వ తేదీ నుండి 22 వరకు అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
జూన్ 4న సురక్ష దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విద్యుత్ విజయోత్సవం సందర్భంగా జూన్ 5న నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులతో వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లను 21 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని సూచించారు. ఇట్టి పనులను ఈరోజు సాయంత్రం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు.
జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో చెరువుల వద్ద సాయంత్రం 5:00 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలన్నారు. చెరువులు, కార్యక్రమాలు నిర్వహించే స్థలం వివరాలను పూర్తి చేయాలని సూచించారు. డబ్బులు, బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి భోజనాలకు విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండగ ఈ రెండు కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని అధికారులందరూ పూర్తి శ్రద్ధతో ఇట్టి పనులను విజయవంతం చేయాలన్నారు.రైతు దినోత్సవం, చెరువుల పండగ పెద్ద కార్యక్రమాలు అయినందున ఎలాంటి పొరపాట్లు జరగకుండా కార్యక్రమాలను విజయవంతం చేయాలా పోలీసు శాఖ విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ జిల్లా అధికారుల తోపాటు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీవోలు, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post