తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నేడు వరంగల్ పొలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

వరంగల్

ప్రచురునార్ధం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నేడు వరంగల్ పొలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

వరంగల్ కమిషనరేట్ నుండి IDOC స్థలం వరకు పెట్రో కార్,బ్లూ కోల్ట్స్ వాహనాల ప్రదర్శన ,పోలీస్ కవాతు జరిగింది

ఈ కార్యక్రమంలో వరంగల్ సిపి ఏవి రంగనాధ్, కలెక్టర్ ప్రావీణ్య,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ ,డీసీపీ భారీ,ఆర్డీవో మహేందర్ జీ,ఎనమాముల మార్కెట్ చేర్మెన్ దిడ్డి భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ ,ఏసీపీ,సీఐలు,పోలీసు ఉన్నతాధికారులు,స్థానిక కార్పొరేటర్ తో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నాయకులు హాజరయ్యారు

ఈ సందర్భంగా వరంగల్ సీపీ ఏవి రంగనాధ్ మాట్లాడుతూ…
తెలంగాణ వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థలో గుణాత్మక మార్పులు వచ్చాయని..
ప్రెండ్లి పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉన్నామన్నారు

ప్రజలతో,బాధితులతో ప్రెండ్లి గా ఉండి వారికి న్యాయం చేస్తున్నామన్నారు

తెలంగాణ వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందన్నారు

సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండి నేరస్తులను పట్టుకోవడానికి సులభంగా మారిందన్నారు

దేశంలో ఉన్న మొత్తము సిసి కెమెరాల్లో 70శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు

పాత వాహనాలతో నిందితులను పట్టుకోవాలంటే పోలీసులు ఇబ్బందులు పడే వారని .. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక
ఇప్పుడు మోడరన్ వాహనాలు ఉన్నాయన్నారు

పోలీసు స్టేషన్లు కార్పొరేట్ స్థాయి బిల్డింగుల మాదిరిగా మారాయని..
లాకప్ డెత్స్ లేకుండా ఉండాలనే ఉదేశ్యం తో …సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్నామన్నారు

సిసి కెమెరాల వల్ల ఎంతో సులభంగా నేరస్తులను పట్టుకోవడానికి సాధ్యం అయ్యిందన్నారు

ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పోలీసులు వ్యవస్థ పని చేస్తోందన్నారు

కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ…

నేడు మనం ఏర్పాటు చేసుకున్న ఈ సురక్షా దినోత్సవ వేడుక ప్రాంగణం ఒక హిస్టారిక్ గ్రౌండ్ అన్నారు

తెలంగాణలో మంచి పోలీస్ శాఖ వారికి మంచి వాహనాలు,టెక్నాలజీ పరంగా కూడా చాలా ముందంజ లో ఉన్నామన్నారు ..

రాత్రి పగలు అనే తేడా లేకుండా..
ప్రజలు భద్రతగా ఉంటున్నారు..అంటే పోలీసు వ్యవస్థ బాగుండడమే ఇందుకు కారణమన్నారు

ఒకప్పుడు మహిళా ఉద్యోగులు నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్ళాలి అంటే బయపడేవారని… కానీ నేడు ఆ పరిస్థితులు లేవన్నారు

మారుముల గ్రామం వరకు కూడా పోలీస్ సిబ్బంది 24 గంటలు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నరన్నారు.

తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ

వరంగల్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన వరంగల్ తూర్పులో నిర్వహించడం సంతోషకరమన్నారు

పోలీస్ అంటే ఇలా ఉండాలనే విదంగా… గొప్పగా సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్న పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నాక నాడు ఎట్లా ఉంది నేడు ఎట్లా ఉంది అనేది స్పష్టంగా కనపడుతుందన్నారు

నాడు కేసీఆర్ నాయకత్వం లో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతిని సాధించిందని…పోలీసు వ్యవస్థ ఎంత గొప్పగా మారింది అనేది మన కళ్ళముందు ఉందన్నారు

ఎంతో మంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చిందని…
తెలంగాణ రాకముందు ఉన్న డొక్కు వాహనాల తో ,టెక్నాలజీతో పోలీసులు కేసులను ఛేదించాలంటే ఇబ్బందులు పడే వారని…
నేడు తెలంగాణ వచ్చిన తరువాత మంచి వాహనాలు,గొప్ప టెక్నాలజీ,పోలీస్ ఆరోగ్య రక్షణ తో పాటు అన్ని రకాలుగా తెలంగాణ సర్కారు సహకరిస్తుందన్నారు

Share This Post