ప్రచురునార్ధం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయము గా పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014 -2023 సందర్బంగా జూన్ 2 వ తేదీ నుండి 22 వరకు జరిగే కార్యక్రమాల పైన హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో
ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేయగా..ఎంపీ పసునూరి దయాకర్, శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, నగర మేయర్ గుండు సుధారాణి, సీపీ A. v. రంగనాథ్,
GWMC కమిషనర్,శాసనసభ్యులు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి, రాజయ్య, గండ్ర వెంకట రమణ రెడ్డి,
MLC బస్వరాజు సారయ్య
హాజరయ్యారు
ఈ సందర్బంగా
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి స్పీచ్
జూన్ 2 నుండి 22 వ తేదీ వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం గా జరిగేందుకు
పక్కాగా చేసుకునేందుకు నియోజకవర్గం లో సమావేశం పెట్టుకోవాలి
జూన్ 2 నాడు జిల్లా స్థాయిలో పథకవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగాలి
ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలి
జూన్ 3 రైతు దినోత్సవం రోజు
ప్రతీ రైతు వేదికల లో మామిడి తోరణాలతో అలంకరణ చేయాలి
Mla అధ్యక్షతన మీటింగ్ పెట్టాలి
రైతు వేదిక లో జరిగే కార్యక్రమానికి గెస్ట్ లను పిలవాలి
రైతు బంధు, రైతు భీమా వివరాలను క్లస్టర్ వారీగా ఫ్లెక్సీ పెట్టాలి
చెరువులు బాగు చేయటానికి ఎంత ఖర్చు పెట్టామో తెలిసేలా ఫ్లెక్సీ పెట్టాలి
24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఎంత బిల్ చెల్లిస్తున్నాం,
ఒక్కో రైతు కు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియజేయాలి
భోజనాలు మంచిగా పెట్టాలి
అందరిని కో ఆర్డినేట్ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలి
జూన్ 4 సురక్ష దినోత్సవం
ఆరోజు సాయంత్రం సమావేశం పెట్టి శాంతి భద్రత అంశం లో
పోలీస్ వ్యవస్థ ను ఎలా బలోపేతం చేసామో చెప్పాలి
జూన్ 5 న విధ్యుత్ దినోత్సవం సందర్బంగా …
1000 మంది రైతులతో మీటింగ్ పెట్టాలి
విద్యుత్ వ్యవస్థ లో చేసిన అభివృద్ధి ని తెలియజేయాలి
జూన్ 6 న జిల్లా లో పారిశ్రామిక ప్రగతి ని వివరించాలి
ఈ 9 యేండ్లలో ఎన్ని పరిశ్రమ లు వచ్చాయి.. దాని వల్ల ఎంత మందికి ఉపాధి దొరికిందో తెలపాలి
పూర్తిగా మూత పడిన srsp ని మళ్ళీ ఇలా పునర్జీవ్వం ఇచ్చాం,
బాగు చేసుకున్న చెరువులు, చెక్ డ్యామ్ ల వద్ద పండుగ వాతావరణం ఉండాలి
నియోజకవర్గం వారీగా గతం లో ఎన్ని ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు.. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నాం అనేది చెప్పాలి..
ప్రాజెక్ట్ ల వల్ల జరుగుతున్న మేలును వివరించాలి
ప్రతీ gp లోని చెరువు దగ్గర పండుగ చేసుకోవాలి
కట్ట మైసమ్మ వద్ద పూజలు జరగాలి
బోనాలు, బతుకమ్మ లతో తరలి రావాలి
భోజనాలు ఏర్పాటు చేయాలి
Dpo, ఫిషరీస్,మహిళా గ్రూప్ సభ్యులు అందరూ కో ఆర్డినేట్ చేసుకోవాలి
రిటైర్డ్ ఇంజనీరింగ్ ఉద్యోగులను
ఆహ్వానించి సన్మానం చేయండి
జూన్ 9 రోజు.
నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో సంక్షేమ సంబరాల కార్యక్రమం చేయాలి
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేయాలి
కుల వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళను గుర్తించి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలి
గొర్రెల పంపిణీ, భూ పట్టాల పంపిణీ కూడా చేయాలి
Ikp, స్త్రీ నిధి లోన్ లను ఇచ్చే ప్రోగ్రాం కూడా పెట్టండి
ప్రతీ గ్రామం లో, మున్సిపాలిటీలలో జరిగిన అభివృద్ధి పైన నాడు నేడు అనే పేరుతో ఫ్లెక్సీ పెట్టాలి
మున్సిపాలిటీ లకు, కార్పొరేషన్ లకి పెట్టిన ఖర్చు ను డిస్ప్లే చేయాలి
10 వ తేదీన…
సూపరిపాలన దినోత్సవం సందర్బంగా…
మండల, గ్రామ, మున్సిపాలిటీ పరిధిలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయం లో సెలెబ్రేషన్స్ జరగాలి
జూన్ 11
సాహిత్య దినోత్సవం సందర్బంగా
జిల్లా స్థాయిలో కవి సమ్మేళనం పెట్టి అవసరమైతే పోటీలు పెట్టండి
కవులందరిని ఘనంగా సన్మానించాలి
జూన్ 12 న
ప్రతీ నియోజకవర్గం లో తెలంగాణ రన్ ని నిర్వహించాలి
పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలి
జూన్ 13 న… మహిళా సంక్షేమ దినోత్సవం సందర్బంగా
బీడీ, ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ లను తెలపాలి
ఆశ, అంగన్వాడీ కార్యకర్తల
జీతాలు పెంచాము, ఇలా ప్రతీ ఒక్క రంగం లో మహిళలకు ఎన్నో చేస్తున్నాం.. అవన్నీ ప్రజలకు తెలియాలి
జూన్ 14 రోజు
గర్భిణీ స్త్రీలకు
న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయాలి
హాస్పిటల్ లలో పడక ల ను పెంచాము.. పల్లె దావఖానా లని ఇచ్చాం… ఇలా వైద్య వ్యవస్థ లో చేసిన అభివృద్ధి ని ప్రజలకి తెలియజేప్పాలి
పేషంట్ లకు పండ్ల పంపిణీ జరగాలి
ఉత్తమ anm, ఆశ, ల్యాబ్ టెక్నీషయాన్ లకు సన్మానం చేయాలి
జూన్ 15 న
పల్లె ప్రగతి దినోత్సవం సందర్బంగా
ప్రతీ gp శుభ్రం గా పెట్టాలి…
ప్రతీ పల్లె లో పండుగ వాతావరణం కనపడాలి
వివిధ శాఖల ద్వారా
గ్రామ అభివృద్ధి కోసం చేసిన కార్యక్రలను తెలిపే
ఒక బుక్లేట్ ను తయారు చేసి ఇంటి ఇంటికి ఇవ్వాలి
సపాయి కార్మికులను సన్మానం చేయాలి
జూన్ 16 వ తేదీన … పట్టణం లో కూడా ప్రతీ వార్డు పరిశుభ్రం గా ఉండాలి
జూన్ 17 వ తేదీన
గిరిజనోత్సవం ను బాగా చేసుకోవాలి
10 శాతం రిజర్వేషన్,
సేవాలాల్ కి సంబందించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునేలా ప్రభుత్వం కృషి చేసింది
జూన్ 18 వ తేదీన … మంచి నీళ్ల పండుగ రోజున
కొత్త ట్యాంక్, ఫిల్టర్ బెడ్ ల దగ్గర ఫ్లెక్సీ పెట్టాలి
ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రతీ కార్యక్రమాన్ని
జూన్ 19 వ తేదీన
అన్నీ శాఖల అధికారులు చెట్లను నాటలి.
జిల్లా, మండల, గ్రామ స్థాయిలో
ప్రతీ డిపార్ట్మెంట్ దగ్గర నర్సరీ ఉండాలి
పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రాం పెట్టండి
చెట్లను నాటడం లో…దేశం లోనే
తెలంగాణ అగ్రస్థానం ఉంది..
జూన్ 20 న విద్య దినోత్సవం సందర్బంగా మన ఊరు మన బడి కార్యక్రమం లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలి
కొత్త గా ఏర్పాటు చేసుకున్న ఇన్స్టిట్యూషన్ లను ప్రారంభీంచుకోవాలి
ప్రతీ స్కూల్ లో పండుగ వాతావరణం కనపడాలి
జూన్ 21 న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్బంగా…ప్రతీ నియోజకవర్గం లో గుళ్ల, మసీదు, చర్చి లను ఎలా అభివృద్ధి చేసుకున్నామో.. అలాగే
రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగ లకు పేద కుటుంబాల కోసం పెడుతున్న ఖర్చు ను ప్రజాప్రతినిధులు చెప్పాలి
జూన్ 22 వ తేదీన…
ప్రతీ gp లో, అన్నీ కార్యలయం లలో
అమరవీరులకు నివాళులు అర్పించాలి
అమర వీరుల స్తూపం దగ్గరికి వెళ్ళాలి
ఇలా జూన్ 2 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి వర్యులు కోరారు
అనంతరం జిల్లా. కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ దశబ్ది ఉత్సవాల సందర్బంగా జిల్లా లో చేపట్టానున్న యాక్షన్ ప్లాన్ ను వివరించారు
జూన్ 2 వ తేదీ నుండి మొదలు కొని 22 వరకు జరిగే ప్రతీ కార్యక్రమం లో ఆయా శాఖల ద్వారా చేయనున్న కార్యక్రమాలకు సంబందించి పక్కా ప్రణాళిక ను రూపొందించినట్లుగా కలెక్టర్ తెలిపారు
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ వాకాడే , శ్రీ వాత్స,అన్నీ శాఖలకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు