తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు

జాతీయ పతాకావిష్కరణ చేయనున్న రాష్ట్ర హోం శాఖ మాత్యులు

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం ……అదనపు కలెక్టర్ వీరారెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు.

జూన్,02 న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆయన
బుధవారం డి.ఆర్. ఓ. తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముఖ్యఅతిథి రాష్ట్ర హోంశాఖ మాత్యులు మమ్మద్ మహమూద్ అలీ విచ్ చేయనున్నట్టు తెలిపారు.

ఉదయం 8:40 ని.లకు జిల్లా కలెక్టరేట్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని,8.50 ని.లకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, 9:00 గంటలకు
జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని తెలిపారు. 9 గంటలకు మంత్రివర్యుల ప్రసంగం ఉంటుందని, 9.30 గంటలకు high tea ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆవిర్బావ దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమం ప్రారంభం మొదలు చివరి వరకు ప్రోటోకాల్ లో ఎటువంటి పోరపాట్లు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు కలెక్టరేట్ సమావేశం మందిరంలో కవిసమ్మేళన కార్యక్రమం (తెలుగు ఉర్దూ మరియు హిందీ భాషలలో) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అధికారులు, ఉద్యోగ సిబ్బంది, ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అదనపు కలెక్టర్ వెంట డి ఆర్ ఓ రాధిక రమణి, ఆర్ డి ఓ, నగేష్, పోలీస్ అధికారులు, కలెక్టరేట్ ఏవో, సూపరిండెంట్ తదితరులు ఉన్నారు

Share This Post